భారత్లో న్యూజిలాండ్ పర్యటన.. మ్యాచ్ లు జరిగే డేట్స్ ఇవే?

praveen
ప్రస్తుతం భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా 2023 ఐపీఎల్ సీజన్ గురించి వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే  అయితే ఇక ఐపిఎల్ సీజన్ ముగిసిన వెంటనే అటు భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు ఐపిఎల్ తో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందనున్నారు ప్రేక్షకులు  ఇక మరోవైపు అటు వరల్డ్ కప్ ద్వారా మరోసారి ఉత్కంఠ భరితమైన పోరుని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే ఇక ఈ రెండు టోర్నీలు ప్రారంభానికి ముందే మరోవైపు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ నిర్విరామంగా క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది.

 ఎందుకంటే ఇక వచ్చే ఏడాది ప్రారంభం నుంచే ఇక వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీ కాబోతుంది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమంలోనే భారత పర్యటనకు రాబోతున్న శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో ఇక మూడు ఫార్మాట్లలో కూడా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవలే భారత పర్యటనకు వచ్చే న్యూజిలాండ్తో ఆడబోయే సిరీస్ లకు సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇక ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే.. శ్రీలంకతో వన్డే సిరీస్ ముగిసిన కేవలం రెండు రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడబోతుంది టీమిండియా.

 కాగా ఇక న్యూజిలాండ్ భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జనవరి 18వ తేదీన హైదరాబాద్ వేదికగా జరగబోతుంది అని చెప్పాలి. జనవరి 21వ తేదీన రెండో వన్డే మ్యాచ్ రాయిపూర్ వేదికగా జరగనుంది. జనవరి 24వ తేదీన మూడో వన్డే మ్యాచ్ను ఇండోర్ వేదికగా నిర్వహించబోతున్నారు. ఇక ఆ తర్వాత రెండు రోజుల వ్యవధిలోనే టీ20 సిరీస్ ఆడుతుంది టీమిండియా. జనవరి 27న తొలి టి20 రాంచీ వేదికగా, జనవరి 29న రెండవ టి20 లక్నో వేదికగా, ఇక ఫిబ్రవరి 1న మూడవ టి20 ఆత్మదాబాద్ వేదికగా జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: