ఫిఫా వరల్డ్ కప్.. భర్త ఇంటికెళ్లిన భార్య ఖతార్ లోనే.. కారణం?

praveen
ప్రస్తుతం ఖతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం నాకౌట్ మ్యాచ్ లు హోరాహోరీగా జరుగుతున్నాయ్. ఈ క్రమంలోనే నాకౌట్ దశకు అర్హత సాధించిన జట్లు ఇక నువ్వా నేనా అన్నట్లుగానే పోటీ పడుతూ ఉన్నాయి అని చెప్పాలి. అదే సమయంలో ఇక అభిమానులు అందరూ కూడా భారీగా స్టేడియం కు తరలివచ్చి తమ అభిమానం జట్టుకు మద్దతు పలికేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ఆటగాళ్ల కుటుంబ సభ్యులు కూడా ఇలా తమ మద్దతును ప్రకటిస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇకపోతే కొంతమందికి మాత్రం నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే తాము మద్దతు ప్రకటిస్తున్న జట్లు చివరికి పేలువ ప్రదర్శన కారణంగా ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురవడంతో ఎంతోమంది ఇక ఆటగాళ్లకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అభిమానులు కూడా స్వదేశం తిరిగి పయనం అవుతున్నారు. అయితే సాధారణంగా ఇక ఒక స్టార్ ఫుట్ బాల్ ప్లేయర్ భార్య ఇక తన భర్తకు మద్దతు తెలపడానికి వచ్చిన సమయంలో ఒకవేళ తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు టోర్నీ నుండి నిష్క్రమిస్తే  భర్తతో పాటే భార్య కూడా వెళ్ళిపోతూ ఉంటుంది.

 కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు అని చెప్పాలి. ఏకంగా నాలుగు సార్లు ఛాంపియన్ అయినా జర్మని అనూహ్యంగా గ్రూప్ దశలోనే వెనుతిరిగింది. ఈ క్రమంలోనే ఓటమితో ఆ జట్టు గోల్ కీపర్ గా ఉన్న కెవిన్ ట్రాప్స్ సొంతదేశానికి వెళ్ళిపోయాడు. అయితే అతని భార్య ఇజబెల్ మాత్రం ఖాతార్ లోనే ఉండిపోయింది. ఎందుకంటే ఇజబెల్ కు   తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న జర్మనీ కంటే ఐదు సార్లు ఛాంపియన్ అయిన బ్రెజిల్ జట్టు అంటే ప్రాణం. ఎందుకంటే బ్రెజిల్ లోనే ఇజాబిల్ పుట్టి పెరిగింది. దీంతో ఇక భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు ఓడిపోయి ఇంటి బాట పట్టినప్పటికీ తన సొంత దేశానికి మద్దతు ప్రకటించడం కోసం భర్తతో వెళ్లకుండా ఖతర్ లోనే ఉండిపోయింది. ఇక ఈ విషయం తెలిసి బ్రెజిల్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: