వార్నర్ తప్పేమీ లేదు.. వాళ్లు ఓకే అంటేనే టాంపరింగ్ చేసాడు?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు డేవిడ్ వార్నర్. జట్టు కష్టాల్లో ఉన్న ఎన్నోసార్లు ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. ఇక ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా  కూడా తనకంటూ ప్రత్యేకమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. తన ఆట తీరుతోనే కాదు తనలోని మంచి మనస్సుతో కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. ఇక ఇలాంటి స్టార్ ప్లేయర్ విషయంలో గత కొంతకాలం నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా వ్యవహరిస్తున్న తీరు మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.

 2018 లో బాల్ టాంపరింగ్ వివాదంలో ఇరుక్కున్నాడు డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే రెండేళ్లపాటు నిషేధం విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకుంది. ఇక మిగతా ఆటగాళ్లపై కూడా ఇలాంటి చర్యలు తీసుకుంది. కానీ ఒక డేవిడ్ వార్నర్ పై మాత్రం ఏకంగా జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. అయితే డేవిడ్ వార్నర్ పై ఉన్న కెప్టెన్సీ నిషేధాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఎత్తివేస్తుంది అని ఇక ఎన్నో రోజుల నుంచి అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
 ఇటీవల తనపై ఉన్న కెప్టెన్సీ నిషేధం ఎత్తివేసేందుకు ఇక అభ్యర్థన పెట్టుకునేందుకు డేవిడ్ వార్నర్ కి అవకాశం రాగా.. అతను రిక్వెస్ట్ చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా మరోసారి నిషేధం ఎత్తివేయడానికి మొగ్గుచూపులేదు. ఇకపోతే ఇటీవల ఈ విషయంపై చర్చ జరుగుతూ ఉండగా.. డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్  సంచలన విషయాలను బయటపెట్టాడు. సౌత్ ఆఫ్రికా పై ఓడినందుకు ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆసిస్ ఆటగాళ్లపై మండిపడ్డారు. ఆ టైంలో వార్నర్ కలుగజేసుకొని మ్యాచ్ గెలవాలంటే రివర్స్ స్వింగ్ తోనే సాధ్యమవుతుందని అందుకు బాల్ టాంపరింగ్ చేయాలని కూడా ముందే చెప్పేసాడు. ఇందుకు ఎగ్జిక్యూటివ్స్ అంగీకరించడంతోనే డేవిడ్ వార్నర్ బాల్ టాంపరింగ్ కి పాల్పడ్డాడు అని షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు వార్నర్ మేనేజర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: