తండ్రి పోలికలు అస్సలు రాలేదు.. మెస్సి కొడుకు వీడియో వైరల్.
ఈ క్రమంలోనే వరుస విజయాలు సాధిస్తున్న అర్జెంటిన జట్టు ప్రస్తుతం నాకౌట్ దశకు క్వాలిఫై అయింది అని చెప్పాలి. ఇక మెస్సి కూడా తనదైన శైలిలో ఆట తీరు కనబరుస్తూ అభిమానులు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇక ఇదంతా పక్కన పెడితే సాధారణంగా మెస్సి ప్రశాంతతకు మారుపేరు. అందరిలాగా మైదానాల్లో వివాదాలకు అస్సలు తేరలేపడు. ఇక ఎలాంటి సమయాల్లో అయినా సరే ఎంతో ప్రశాంతంగా నవ్వుతూ కనిపిస్తాడు కానీ ఇటీవల మెస్సి కుమారుడు మాత్రం అతనికి విరుద్ధంగా ఉన్నాడు. తండ్రి ఎంతో ప్రశాంతంగా ఉంటే కొడుకు తుంటరోడిలా కనిపిస్తున్నాడు అని చెప్పాలి.
ఆస్ట్రేలియాతో జరిగిన ఫ్రీ క్వార్టర్స్ మ్యాచ్ కు మెస్సి భార్య అంటోనీలా రోజూక్కో తన కుమారుడితో కలిసి హాజరైంది. ఈ క్రమంలోనే మ్యాచ్లో 35వ నిమిషంలో మెస్సిగోల్ చేసినప్పుడు కొడుకుతో కలిసి ఎంతగానో సెలబ్రేషన్స్ చేసుకుంది అంటోనీలా. మెస్సికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. కానీ మెస్సి కొడుకు తన తుంటరితనాన్ని బయట పెట్టాడు. ఏకంగా తన నోట్లో ఉన్న చూయింగం చేతితో తీసుకుని ముందు ఉన్న ఫుట్బాల్ ప్రేక్షకుల మీదికి విసిరాడు. దీంతో అక్కడ ఉన్న ఆడియన్స్ ఎంతో సీరియస్గా వెనక్కి చూసినప్పటికీ.. అక్కడ ఉన్నది మెస్సి కొడుకు అని తెలిసి ఇక ఏమీ చేయలేకపోయారు. ఇది చూసినా ఇక ఆ బుడ్డోడి తల్లి అతనికి చివాట్లు పెట్టింది. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఇది చూసిన నేటిజన్స్ తండ్రి పోలికలు అతనికి అస్సలు రాలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు.