భయపడినట్లే జరిగిందిగా... ఇండియా బంగ్లా మ్యాచ్ ఫలితం !

VAMSI
నిన్న ఢాకాలోని షేర్ ఏ బంగ్లా స్టేడియం లో ఇండియా మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్యన మొదటి వన్ డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇండియాను బంగ్లాదేశ్ ఒక్క వికెట్ తేడాతో ఓడించి సిరీస్ లో 1-0 ఆధిక్యాన్ని అందుకుంది. న్యూజిలాండ్ పర్యటనలోనూ టీ 20 సిరీస్ ను గెలుచుకుని వన్ డే సిరీస్ ను కోల్పోయిన ఇండియా, తాజాగా జరుగుతున్న బంగ్లా వన్ డే సిరీస్ లోనూ తడబడుతోంది. నిన్న మ్యాచ్ కు ముందు నుండి మనము ఊహించిన విధంగానే ఇండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగినట్లు అనిపించలేదు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టిన రోహిత్ సేన బంగ్లా బౌలర్ల దెబ్బకు కేవలం 186 పరుగులకే కుదేలైంది.
వాస్తవానికి జట్టులో రోహిత్, కోహ్లీ , రాహుల్ లు ఉన్నప్పటికీ ఈ స్థాయి స్కోర్ ను ఏ అభిమాని ఊహించనేలేదు. రోహిత్ శర్మ 27 పరుగులతో బాగానే ఆడుతున్నట్లే కనిపించినా షకీబ్ స్పిన్ కు బౌల్డ్ అయ్యాడు. ధావన్ (7) మరియు కోహ్లీలు (9) సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. శ్రేయాస్ (24) మరియు రాహుల్ లు కాసేపు ఇండియాను ఆదుకున్నట్లే కనిపించారు. కానీ శ్రేయాస్ కూడా అవుట్ అవడంతో ఇండియా సీన్ అయిపోయింది. రాహుల్ ఒక్కడే తనకు సాధ్యమైనంత వరకు క్రీజులో ఉండి కనీసం ఆ స్కోర్ అయినా టార్గెట్ గా పెట్టేలా చూశాడు. చివరికి ఇండియా నిర్ణీత ఓవర్ లలో 186 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బంగ్లా బౌలర్లలో షకీబ్ వికెట్లు మరియు ఎబాదత్ హుస్సేన్ 4 వికెట్లు తీసుకున్నాడు.
ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాకు మొదటి ఓవర్ లోనే దీపక్ చాహర్ అద్భుతమైన అవుట్ స్వింగర్ తో శాంటో ను అవుట్ చేశాడు. ఈ స్కోర్ ను ఈజీ గా సాధిస్తుంది అనుకున్న బంగ్లా కాస్త ఒకదశలో పరుగులకు తొమ్మిది వికెట్ లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక విజయం ఇండియాదే అనుకున్నారు అంతా. కానీ ఇక్కడే బంగ్లా ఆటగాళ్లు మెహిదీ హాసన్ మిరాజ్ మరియు ముస్తాఫిజర్ రెహ్మాన్ లు అద్భుతం చేసి చూపించారు. వీరిద్దరూ ఆఖరి వికెట్ కు 51 పరుగులు జోడించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఇటీవల ఇండియా వన్ డే లలో చేస్తున్న ప్రదర్శన పట్ల కాస్త భయపడ్డట్లే మొదటి వన్ డే లో రోహిత్ సేన దారుణంగా ఫెయిల్ అయ్యి ఓటమిని మూటగట్టుకుని సిరీస్ ను కోల్పోయే ప్రమాదంలో పడింది .  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: