సెంచరీలు కొట్టడంలో.. బాబర్ ప్రపంచ రికార్డు?

praveen
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్మెన్ల గురించి చర్చించుకుంటే నేటితరం క్రికెటర్లలో అటు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కూడా ఈ లిస్టులో చోటు సంపాదించుకుంటాడు అని చెప్పాలి. ఎందుకంటే తన అత్యుత్తమమైన ప్రదర్శనతో ఎన్నోసార్లు జట్టుకు విజయాన్ని అందించాడు బాబర్.  అంతే కాదు విరాట్ కోహ్లీ తర్వాత ఎక్కువ కాలం పాటు అటు నెంబర్ వన్ బ్యాట్స్మెన్ స్థానంలో కొనసాగాడు అని చెప్పాలి. ఇక అలాంటి బాబర్ కొంతకాలం నుంచి మాత్రం ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
 మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. ఏకంగా జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపిస్తూ తన బ్యాటింగ్ తో జట్టును విజయ తీరాలకు చేర్చాల్సిన బాబర్  పేలువ ప్రదర్శనతో జట్టుకు భారంగా మారిపోయాడు అని చెప్పాలి. దీంతో అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి  వెంటనే అతన్ని జట్టు నుంచి తప్పించాలి అంటూ ఎంతో మంది డిమాండ్ కూడా చేశారు అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ వరుసగా సిరీస్ లతో బిజీబిజీగా గడుపుతుంది ఇలాంటి సమయంలోనే మళ్ళీ బాబర్ ఫామ్ అందుకుని తన బ్యాట్ తో చెలరేగిపోతున్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల ఇంగ్లాండుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేశాడు అని చెప్పాలి. ఏకంగా తొలి టెస్ట్ మ్యాచ్లో 176 పరుగులు చేసి సెంచరీ తో కదం తొక్కాడు. ఇకపోతే ఈ ఏడాది బాబర్  కు ఇది ఏడవ శతకం కావడం గమనార్హం. దీంతో అతడు ఈ ఏడాది అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్గా అవతరించాడు అని చెప్పాలి. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్ట్రో  ఆరు సెంచరీలు కొట్టగా ఇటీవల అతని రికార్డును బాబర్ బద్దలు కొట్టేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: