సిరీస్ ఓడినా.. టీమిండియాకు మంచే జరిగింది : రవిశాస్త్రి

praveen
ఇటీవల టీమిండియా జట్టు న్యూజిలాండ్ పర్యటన ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ప్రదర్శన ఎలా ఉండబోతుందో అని అందరూ ఆసక్తికరంగా వేచి చూశారు. ఎందుకంటే ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సీనియర్లతో కూడిన టీమిండియా జట్టు బరిలోకి దిగింది. ఈ క్రమంలోనే కప్పు గెలుస్తుంది అనుకున్న జట్టు ఇక అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది అన్న విషయం తెలిసిందే. లీగ్ దశలో బాగానే రాణించిన టీమిండియా జట్టు అటు సెమీఫైనల్ లో మ్యాచ్లో మాత్రం చేతులెత్తేసింది. దీంతో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని చవి చూసింది అని చెప్పాలి.

 అయితే ఇక టీమిండియాలో మార్పులు తీసుకొచ్చేందుకు యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వగా వాళ్ళు న్యూజిలాండ్ పర్యటనలో ఎలా రాణిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా జట్టు 1-0 తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించి  సిరీస్ ను కైవసంచేసుకుంది. కాగా తర్వాత శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బలిలోకి దిగిన టీమ్ ఇండియా జట్టు వన్డే సిరీస్ లో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు వర్షం ఆటంకం కలిగించడం ద్వారా ఇక చివరికి ధావన్ సేనను ఓటమి వెంటాడింది అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో సిరీస్ ఓడిపోవడం పై స్పందించిన మాజీ కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా జట్టు ఓడిపోయినప్పటికీ కూడా అటు భారత యువ ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం అద్భుతం అంటూ కొనియాడాడు. ఏకంగా రెండు మ్యాచ్లలో కూడా శ్రేయస్ అయ్యర్ బాగా రాణించాడు. ఉమ్రాన్ మాలిక్ తన బౌలింగ్ తో అదరగొట్టాడు. జట్టులోకి వచ్చిన శుభమన్ గిల్ మంచి ఆరంభాలు అందించాడు.ఇక గాయం నుంచి కోలుకుని మళ్ళీ పునరాగామనం చేసిన వాషింగ్టన్ సుందర్ అదరగొట్టాడు అంటూ ప్రశంసలు కురిపించాడు రవి శాస్త్రి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: