అందరూ తడబడినా.. అతని గురి తప్పలేదు : రవిశాస్త్రి

praveen
ఇటీవల టీమిండియా జట్టు న్యూజిలాండ్ పర్యటనను ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. అక్కడ వరుసగా టీ20,  వన్డే సిరీస్ ఆడిన టీమిండియా జట్టు టి20 సిరీస్లో విజయం సాధించినప్పటికీ వన్డే సిరీస్ మాత్రం కోల్పోయింది. అదే సమయంలో ఇక వర్షం కారణంగా ఇరుజట్లు   కూడా ఎంతగానో ఇబ్బంది పడ్డాయి అని చెప్పాలి. అయితే ఇక న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఎవరు ఊహించని విధంగా జట్టులో స్థానం సంపాదించుకున్న యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి అవకాశాన్ని దక్కించుకున్నారు.

 ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆటగాళ్లు ఇక తమ ప్రతిభను బయటపెట్టారు అన్న విషయం తెలిసిందే. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్ల ప్రదర్శన పై అటు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా గాయం కారణంగా కొన్నాళ్లపాటు జట్టుకు దూరమై ఎన్నో రోజుల తర్వాత మళ్లీ పునరాగమనం చేస్తున్న వాషింగ్టన్ సుందర్ ఎవరు ఊహించని విధంగా అదిరిపోయే ప్రదర్శన చేశాడు.

 ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు రవి శాస్త్రి. గాయం కారణంగా జట్టుకు దూరమై మళ్ళీ పునరాగం మనం చేసిన వాషింగ్టన్ సుందర్ వచ్చిన అవకాశాన్ని ఎంతో అద్భుతంగా ఓడిసిపట్టాడు. బ్యాటింగ్ పరంగా మంచి పరిణితి కనబరిచాడు. ఇక క్లిష్ట సమయంలో టాప్ ఆర్డర్ సైతం తడబడింది. కానీ వాషింగ్టన్ సుందర్ మాత్రం ఎంతో పొందికగా ఆడాడు. కఠినమైన పరిస్థితుల్లో అర్థ శతకం కొట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇక ఈ ఇన్నింగ్స్ వాషింగ్టన్ సుందర్ కు ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది అంటూ రవి శాస్త్రి ప్రశంసల కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: