బంగ్లాదేశ్ కి ఊహించని షాక్.. ఏకంగా కెప్టెన్ దూరం?

praveen
ఇటీవల న్యూజిలాండ్ పర్యటనను ముగించుకున్న టీమిండియా జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఇక బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ తో పాటు ఒక టెస్టు సిరీస్ కూడా ఆడబోతుంది. అయితే ఇక చాలా ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ గడ్డమీద అడుగుపెట్టిన టీమిండియా జట్టు.. అక్కడ ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అన్న విషయం పైనే అందరి దృష్టి ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన టి20 వన్డే సిరీస్ లకు విశ్రాంతి తీసుకున్న కారణంగా దూరమైన సీనియర్లు అందరూ కూడా మళ్లీ బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ లకు జట్టులో చేరారు అని చెప్పాలి.

 దీంతో ప్రస్తుతం భారత జట్టు ఎంతో పటిష్టంగా మారింది. అదే సమయంలో ఇక ఇటీవల కాలంలో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్న బంగ్లాదేశ్ జట్టును ఏకంగా వారి సొంత దేశంలోనే టీమిండియా ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది అని చెప్పాలి. అయితే ఆదివారం నుంచి బంగ్లాదేశ్ టీమ్ ఇండియా మధ్య ఇక వన్డే సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే బంగ్లాదేశ్ జట్టుకు ఊహించని ఒక భారీ ఎదురు దెబ్బ తగిలింది అన్నది తెలుస్తుంది. ఏకంగా బంగ్లాదేశ్ కెప్టెన్ గా ఉన్న తమిమ్ వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు అని చెప్పాలి.

 ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించడం గమనార్హం. గజ్జల్లో గాయం కారణంగా ఇక్బాల్ ఇక జట్టుకు దూరం కాబోతున్నాడు అన్న విషయాన్ని వెల్లడించింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. అయితే ట్రైనింగ్ మ్యాచ్ సందర్భంగా ఈ గాయం జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఫేసర్ తస్కిన్ అహ్మద్ సైతం గాయం కారణంగా తొలి మ్యాచ్కు అందుబాటులో ఉండలేకపోతున్నాడు అన్న విషయం తెలిసిం. దే అయితే గాయం కారణంగా ఇక కెప్టెన్ తమీమ్ సైతం వన్డే సిరీస్ కు పూర్తిగా దూరమైనట్లే అని తెలుస్తుంది.  ఇక భారత్తో జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ నాటికి కోలుకొని మళ్ళీ జట్టుతో కలిసె అవకాశం ఉంది. అయితే తమిమ్ ఇక్బాల్ కి గాయం అయిన నేపథ్యంలో తర్వాత కెప్టెన్ ఎవరు అనేది త్వరలో వెల్లడిస్తాం అంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: