ఆస్ట్రేలియా VS వెస్ట్ ఇండీస్: లబుచెన్ "డబుల్ సెంచరీ " వన్ సైడ్ గా పెర్త్ టెస్ట్ !

VAMSI
టీ 20 వరల్డ్ కప్ లో దారుమైన ప్రదర్శన చేసిన వెస్ట్ ఇండీస్ మరియు డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి సెమీస్ కు కూడా చేరకుండా ఇంటి దారి పట్టిన ఆస్ట్రేలియా జట్లు టెస్ట్ సిరీస్ ను ఆడుతున్నాయి. ఈ సిరీస్ లో మొత్తం రెండు టెస్ట్ లు మాత్రమే షెడ్యూల్ చేయబడ్డాయి. అందులో భాగంగా మొదటి టెస్ట్ నిన్నటి నుండి పెర్త్ వేదికగా స్టార్ట్ అయింది. మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ను ఎంచుకున్నాడు. కానీ ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే వార్నర్ రూపంలో షాక్ తగిలినా.. ఆ తర్వాత మరో వికెట్ పడకుండా ఖవాజా మరియు లబుచెన్ 142 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.
ఇక ఖవాజా 65 పరుగుల వద్ద మేయర్స్ బౌలింగ్ లో అవుట్ అయిన తర్వాత స్టీవ్ స్మిత్ లబుచెన్ కు జత కలిశాడు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి వెస్ట్ ఇండీస్ బౌలర్లకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పరుగుల వరద పారించారు. ఈ దశలో లబుచెన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు, 150 పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ రోజు ఉదయం ఆట కొనసాగగా లబుచెన్ 348 బంతుల్లో తన డబల్ సెంచరీని ప్రతి చేసుకున్నాడు. ఇది అతనికి కెరీర్ లో రెండవ డబుల్ సెంచరీ కావడం విశేషం. అయితే లంచ్ కు ముందు ఓవర్ లో పార్ట్ టైం బౌలర్ క్రైగ్ బ్రెత్ వెయిట్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి 204 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
తన మారథాన్ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా ను పటిష్టమైన స్థితిలో నిలిపాడు. మరోవైపు స్టీవ్ స్మిత్ సైతం సెంచరీని పూర్తి చేసుకుని నిలకడగా ఆడుతున్నాడు.. అతనికి హెడ్ చక్కని సహకారాన్ని అందిస్తుంన్నాడు. ఏ క్షణమైనా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే అవకాశం ఉంది. ఇక వెస్ట్ ఇండీస్ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు అని చెప్పాలి. సీల్స్ , మేయర్స్ , బ్రెత్ వెయిట్ లు తలో ఒక వికెట్ ను తీసుకున్నారు. ఇక ఈ మ్యాచ్ లో వెస్ట్ ఇండీస్ గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే.      

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: