నిజంగా సెలెక్టర్లు తప్పు చేశారు.. అతన్ని ప్రపంచకప్ కు ఎంపిక చేసి ఉంటే?

praveen
భారత జట్టుకు దొరికిన అరుదైన బౌలర్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న ఉమ్రాన్ మాలిక్ ఇక మొన్నటికి మొన్న టి20 ఫార్మాట్లో భారీగా పరుగులు సమర్పించుకొని.. జట్టులో స్థానం కోల్పోయాడు కానీ ఇక ఇటీవలే చాలా రోజుల తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరుగుతున్న వన్డే సిరీస్ లో అవకాశం దక్కించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన కెరీర్ లోనే మొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ ఆడిన ఉమ్రాన్ మాలిక్ ప్రదర్శన ఎలా ఉండబోతుంది అనే దానిపైనే అందరి దృష్టి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి వన్డే మ్యాచ్లో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఈ కాశ్మీరీ బౌలర్.

 5 ఓవర్లలో తన బౌలింగ్ తో నిప్పులు చేరిన ఉమ్రాన్ మాలిక్ ఏకంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను భయపెట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు అని చెప్పాలి. ఆ తర్వాత 5 ఓవర్ లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇక తన పేస్ స్పీడ్ బౌలింగ్ తో ఏకంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లను ముప్పు తిప్పలు పెట్టాడు అని చెప్పాలి. ఇకపోతే ఈ మ్యాచ్ లో భాగంగా కొన్ని బంతులను 150 కిలోమీటర్లకు పైగా విసరడం గమనార్హం. దీంతో అతని బౌలింగ్ ప్రతిభ చూసిన తర్వాత అతన్ని వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయకుండా తప్పు చేశారు అంటూ మరోసారి అటు బీసీసీఐ సెలెక్టర్స్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 ఉమ్రాన్ మాలిక్ గతంలో మాదిరిగా వేగంగా బౌలింగ్ చేయడమే కాదు ఫుల్ లెన్త్, బ్యాక్ లెన్త్, స్లోయర్, యార్కర్, షాట్ పిచ్ బాల్స్ తో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడుతున్నాడని.. అతని బౌలింగ్ లో ఎంతో పరిణీతి కనిపిస్తుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇలాంటి అరుదైన బౌలర్ ను బీసీసీఐ తక్కువ అంచనా వేసింది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ లో సంచలన ప్రదర్శన చేసిన తర్వాత కూడా ఉమ్రాన్ మాలిక్ ఏం చేయగలడు అనే విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అంచనాకు రాలేకపోయాడని విమర్శలు గుప్పిస్తూ ఉండడం గమనార్హం. ఒకవేళ ఆస్ట్రేలియా లాంటి పిచ్ లపై ఉమ్రాన్ మాలిక్ ఆడి ఉంటే మాత్రం టీమిండియా తప్పకుండా వరల్డ్ కప్ గెలిచేదని కొంతమంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: