విరుష్క జంట అద్దె ఫ్లాట్.. రెంట్ ఎంతో తెలిస్తే షాకే?

praveen
బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క శర్మ టీమిండియాలో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ జంటకు సోషల్ మీడియాలో ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవలే వరల్డ్ కప్ లో భాగంగా విరాట్ కోహ్లీ ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేసాడు.  వరల్డ్ కప్ లో భాగంగా ఒకవైపు టీమిండియా నిరాశపరిచినప్పటికీ అటు విరాట్ కోహ్లీ మాత్రం టాప్ స్కోరర్ గా నిలిచాడు అని చెప్పాలి. ప్రస్తుతం భారత జట్టు  న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా.. విరాట్ కోహ్లీ కి విశ్రాంతి ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు సెలెక్టర్లు.

 ఈ క్రమంలోనే ఈ ఖాళీ సమయాన్ని కాస్త తన కుటుంబంతో గడుపుతూ  తెగ ఎంజాయ్ చేస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమం లోనే తన భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లీ ప్రస్తుతం వెకేషన్ వెళ్ళాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక విరుష్క జంట ముంబైలోని ఒక ఖరీదైన ప్రాంతంలో ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నారు అన్న వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తుంది అని చెప్పాలి. అత్యంత ఖరీదైన జూహు ప్రాంతంలోని సముద్రానికి ఎదురుగా ఒక ప్లాట్ ను అద్దెకు తీసుకున్నారట అనుష్క, విరాట్ కోహ్లీ జంట.

 అయితే ఇక ఇలా విరాట్ కోహ్లీ జంట తీసుకున్న ఇల్లు అద్దె నెలకు ఏకంగా 2.76 లక్షల రూపాయలు అన్నది తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. నాలుగవ అంతస్తులో ఉండే ఈ భవనం 1650 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందట. సముద్రానికి ఎదురుగా ఉన్న ఈ ప్లాట్ లో భూగర్భ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయట. ఇక అక్టోబర్ 17వ తేదీన రిజిస్ట్రేషన్ సమయంలో విరాట్ కోహ్లీ 7.5 లక్షల రూపాయలు డిపాజిట్ చెల్లించారట. ఈ అపార్ట్మెంట్ వడోదర రాజ కుటుంబానికి చెందినది అని మాజీ క్రికెటర్ సమర్జిత్ సింగ్ గైక్వాడ్ కు చెందినదిగా సమాచారం. ఏది ఏమైనా ఇక విరుష్క జంట ఒక్క నెలకు 2.76 లక్షల అద్దె చెల్లిస్తూ ఉన్నారన్న విషయం తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: