ఇద్దరం కలిసి పిల్లల్ని కందాం.. హైపర్ ఆది బోల్డ్ కామెంట్స్?

praveen
జబర్దస్త్ ద్వారా ఊహించిన రీతిలో పాపులారిటీ సంపాదించుకుని ప్రస్తుతం టాప్ కమెడియన్ కొనసాగుతున్నాడు హైపర్ ఆది. ఇక జబర్దస్త్ లో తన పంచుల సునామి తో సరికొత్త ట్రెండు సృష్టించాడు అని చెప్పాలి. అయితే ఇక ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఏకంగా కమెడియన్లపై ఏకధాటిగా పంచులు వేస్తూ ఉంటాడు హైపర్ ఆది. కొన్ని కొన్ని సార్లు అమ్మాయిలను కూడా వదలకుండా దారుణమైన పంచులు వేయడం కూడా చూస్తూ ఉంటాం.
 కొన్ని కొన్ని సార్లు ఏకంగా అమ్మాయిలపై హైపర్ ఆది వేసే పంచులు అందరిని ఆశ్చర్యానికి లోన చేస్తూ ఉంటాయి. అమ్మాయిలు అంటే అంత చులకన అయిపోయారా అని కొంతమంది విమర్శలు చేసే విధంగా కూడా హైపర్ ఆది పంచులు ఉంటాయి అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే జబర్దస్త్ రేటింగ్ పెంచేందుకు హైపర్ ఆది కోసం ప్రత్యేకంగా సీరియల్ నటి అయిన సౌమ్యా రావు అనే అమ్మాయిని జబర్దస్త్ యాంకర్ గా తీసుకోవచ్చారు. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో హైపర్ ఆది కూడా సౌమ్య  రావు పై ప్రతి ఎపిసోడ్లో పంచులు వేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే హైపర్ ఆది ఏకంగా యాంకర్ సౌమ్య రావు పై వేసిన ఒక పంచు కాస్త సంచలనంగా మారిపోయింది. ఇటీవలే విడుదలైన ప్రోమోలో భాగంగా ప్రపంచంలో అందరూ చనిపోయి మీరు మాత్రమే మిగిలి ఉంటే ఏం చేస్తారు అంటూ కృష్ణ భగవాన్ హైపర్ ఆదిని ప్రశ్నిస్తాడు. దీంతో హైపర్ ఆది సమాధానం చెబుతూ మేమిద్దరం కలిసి ప్రపంచాన్ని సృష్టిస్తామని ఒకరి తర్వాత ఒకరిని కంటూ ఉంటామని బోల్డ్ కామెంట్స్ చేసాడు ఆది. దీంతో ఏం సమాధానం చెప్పాలో తెలియక సౌమ్యరావు సైలెంట్ గా ఉండిపోయింది. ఇక ఇలాంటి పంచులతో ఎప్పటిలాగానే కొంతమంది హైపర్ ఆదినీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: