నేనేమి క్రిమినల్ ని కాదు.. డేవిడ్ వార్నర్ ఆగ్రహం?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న డేవిడ్ వార్నర్ కెరియర్లో చీకటి రోజులు ఉన్నాయి అంటే అది 2018 బాల్ టాంపరింగ్ మీద వివాదం అని చెప్పాలి. బాల్ టాంపెరింగ్ విపాదంలో ఏకంగా రెండేళ్ల పాటు డేవిడ్ వార్నర్ నిషేధానికి గురయ్యాడు. ఏకంగా పోలీసులు అతన్ని జైలుకు తరలించడం లాంటి ఘటనలు కూడా అభిమానులు అందరిని కూడా ఎంతగానో కలిసివేసాయి.  అయితే రెండేళ్ల పాటు వార్నర్ పై నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా ఇక అతను జీవిత కాలం పాటు కెప్టెన్సీ చేపట్టకుండా నిషేధం విధించడం గమనార్హం.

 ఇన్ని రోజుల తర్వాత మళ్లీ ఇక అతనికి కెప్టెన్సీ నిషేధం ఎత్తివేయాలంటూ అభ్యర్థన చేసుకునేందుకు అవకాశం లభించింది. ఇటీవల క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై డేవిడ్ వార్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిషేధం విధించడం విషయంలో ఉన్న తొందర ఇక నిషేధం ఎత్తివేసె అంశాన్ని సమీక్షించే అంశంలో లేకపోవడం దురదృష్టకరం  అంటూ వ్యాఖ్యానించాడు. బాల్ టాంపరింగ్ వివాదం సమయంలో తాను తన కుటుంబం తీవ్ర వేదనకు గురయ్యాం అంటూ చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు తనపై జీవితకాల కెప్టెన్సీ నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు డేవిడ్ వార్నర్.

 నేనేమీ ఒక క్రిమినల్ ని కాదు ప్రతి వ్యక్తికి తన తప్పు ఏమిటో అందుకు ఎంత కాలం శిక్ష అనుభవించాలో తెలుసుకునే అవకాశం ఇవ్వాలి. ఇందుకు సంబంధించి తదుపరి పరిణామాలు ఏమిటో తెలుసుకునేందుకు పునరాలోచన చేయమని అప్పీలు చేసుకునే హక్కును కల్పించాలి. క్రికెట్ ఆస్ట్రేలియా నాపై నిషేధం విధించింది. కానీ జీవితకాల నిషేధం విధించడం వల్ల నా పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడమే అవుతుంది. నా పక్కన కెప్టెన్, వైస్ కెప్టెన్ అనే హోదా లేకపోయినప్పటికీ కూడా నేను మా జట్టుకు నాయకుడినే అంటూ డేవిడ్ వార్నర్ తీవ్రబోద్వేగానికి లోనయ్యాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: