స్మిత్ @14000 రన్స్.. అరుదైన రికార్డ్?

praveen
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ స్థానంలో ఎన్నో రోజులపాటు కొనసాగి స్టార్ ప్లేయర్గా తన హవా నడిపించిన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ గత కొంతకాలం నుంచి మాత్రం టి20 ఫార్మాట్ కు దూరం అయిపోయాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వన్డే టెస్ట్ ఫార్మాట్లో మాత్రమే ఎక్కువగా చోటు దక్కించుకుంటూ ఉన్నాడు. అయితే ఇక తనకు కలిసి వచ్చిన ఈ రెండు ఫార్మాట్ లలో కూడా స్టివ్ స్మిత్ పరుగుల వరద పారిస్తూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 గత కొన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియా ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు  ఏకంగా ప్రత్యర్థి బౌలర్ల పై పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తూ వీరవిహారం చేస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో కూడా మరోసారి స్టీవ్ స్మిత్  తన బ్యాటింగ్ విధ్వంసం కొనసాగించాడు అని చెప్పాలి. మొన్నటికి మొన్న జరిగిన మొదటి మ్యాచ్ లో 80 పరుగులతో ఆకట్టుకున్న స్మిత్..  ఇటీవల 94 పరుగులు చేశాడు. ఆరు పరుగుల దూరంలో సెంచరీ మిస్ అయ్యాడు అని చెప్పాలి.

 స్టీవ్ స్మిత్ 94 పరుగులతో రాణించడంతో ఇక ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 280 పరుగులు చేసింది అని చెప్పాలి. అయితే గత నాలుగు వన్డేలలో కూడా 61, 105, 80, 94 పరుగులు చేశాడు. ఇక అన్ని ఫార్మాట్లో కలిపి 14000 పరుగులు పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక ఈ మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న తొలి ఆస్ట్రేలియా ప్లేయర్గా అరుదైన రికార్డును సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ విభాగం ప్రత్యర్థి ఇంగ్లాండ్ ను కట్టడి చేయడంతో ఇక 72పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: