హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బీసీసీఐ కీలక నిర్ణయం?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచ కప్ కి ముందు అటు ఆస్ట్రేలియా  భారత పర్యటనకు రాగా.. ఇక ఈ రెండు దేశాల మధ్య జరిగిన టి20 మ్యాచ్ కి అటు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ అభిమానులందరూ కూడా మరోసారి లైవ్ లో క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ఎగబడ్డారు. ఇక ఉప్పల్లో మ్యాచ్ నిర్వహించినందుకు ఎంతగానో సంతోష పడి పోయారు. అయితే ఇప్పుడు మరోసారి ఇక ఇలాంటి ఒక గుడ్ న్యూస్ హైదరాబాద్ క్రికెట్ ప్రేక్షకులందరికీ అందబోతుంది అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మరో సారి ఆస్ట్రేలియా భారత్ మధ్య జరగబోయే మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తుండట.

 అయితే మొన్నటికి మొన్న ఈ రెండు దేశాలు మధ్య టి20 మ్యాచ్ జరిగగా.. ఇక ఇప్పుడు మాత్రం టెస్ట్ జరగ బోతుంది అనేది తెలుస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి మధ్య లో బోర్డర్ గవాస్కర్ సిరీస్ కోసం భారత్కు ఆస్ట్రేలియా జట్టు రానుంది. ఈ క్రమం లోనే నాలుగు టెస్ట్ లు జరగ బోతున్నాయ్. అయితే ఇందులో ఒక మ్యాచ్ ఢిల్లీ వేదిక గా నిర్వహించేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన మ్యాచ్ ల నిర్వహణ కోసం అహ్మదాబాద్, ధర్మశాల, నాగపూర్, చెన్నై, హైదరాబాద్ వేదికలను కూడా పరిశీలిస్తుందట భారత క్రికెట్ నియంత్రణ మండలి.

 ఇప్పుడు వరకు కేవలం ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చిన ధర్మశాలలో నాలుగు టెస్ట్ మ్యాచ్లలో రెండో టెస్ట్ కి వేదికగా నిలవచ్చు అన్నది తెలుస్తుంది.  ఇక అదే సమయంలో ఇక 4 టెస్టులలో ఒక మ్యాచ్ ని హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతున్నారు అని చెప్పాలి. దీంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ అందరుఎంతో సంతోష పడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: