హీరోయిన్ తో డేటింగ్ పై.. శుభమన్ గిల్ ఏమన్నాడో తెలుసా?

praveen
సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజీ ఉంటుంది కాబట్టి వారికి సంబంధించిన విషయం ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా క్రికెటర్ల ప్రేమయనానికి సంబంధించిన విషయాలు ఏవైనా బయటికి వచ్చాయి అంటే చాలు అటు మీడియాకు ఫుల్ మీల్స్ దొరికినంత పని అవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు ప్రేమలో ఉన్నారు అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడు తారస పడుతూనే ఉన్నాయి. ఇక ఇలా రిలేషన్ షిప్ లో కొంతమంది క్రికెటర్లు ఉన్నారు అన్న లిస్టులో భారత యువ ఆటగాడు శుభమన్ గిల్ కూడా ఉండడం గమనార్హం.

 భారత్ యువ బ్యాట్స్మెన్ శుభమన్ గిల్ బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తో డేటింగ్ లో ఉన్నట్లు ఎన్నో రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఇక వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడమే ఎందుకు కారణం. అంతేకాదు ఒకరి పోస్టులకు ఒకరు లైకులు కొడుతూ కామెంట్లు కూడా పెడుతూ ఉంటారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో కొనసాగుతున్నారని ప్రచారం మరింత ఉపందుకుంది అని చెప్పాలి.అయితే ఇప్పటివరకు ఈ ప్రచారంపై అటు శుభమన్ గిల్ కానీ మరోవైపు సారా అలీఖాన్ కానీ ఎక్కడ స్పందించి క్లారిటీ ఇచ్చింది లేదు.

 అయితే ఇలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఇక క్రికెటర్లు ఏదైనా షోలోకి వెళ్లారు అంటే చాలు ఇక వారి ప్రేమ గురించి సంబంధించిన ప్రశ్నలే అందరూ అడుగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఒక షోలో పాల్గొన్న శుభమన్ గిల్ కి కూడా ఇలాంటి ప్రశ్న ఎదురైంది. దీంతో ఆసక్తికర సమాధానం చెప్పాడు. సారాకా సారా సచ్ బోల్ దియా.. అంటే నేను డేటింగ్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు అని బదులిచ్చాడు శుభమన్ గిల్. ఇక బాలీవుడ్ లో ఎక్కువగా ఫిట్ గా ఉండే హీరోయిన్ ఎవరు అంటూ ప్రశ్నించుగా.. సారా అలీ ఖాన్ పేరు చెప్పాడు. దీంతో వీరి మధ్య ప్రేమ నిజమే అని అందరూ అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: