ఓరినాయనో..13 మంది ప్లేయర్లను వదులుకున్న ముంబై ఇండియన్స్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఇప్పటినుంచి మంతనాలు జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియను ప్రారంభించింది బీసీసీఐ ఇప్పటికే ఇక అన్ని ఫ్రాంచైజీ  లకు కీలక ఆదేశాలు జారీ చేసింది అన్న విషయం తెలిసిందే. ఆయా జట్లు తమ జట్టు నుంచి వదులుకోబోయే ఆటగాలను అలాగే అంటిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను కూడా వెంటనే సమర్పించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. బీసీసీఐ ఆదేశాల మేరకు ఇక ఈ పూర్తి వివరాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి సమర్పించాయి అన్ని జట్లు.

 ఈ క్రమంలోనే ఏకంగా కొన్ని జట్లు స్టార్ ప్లేయర్స్ ను సైతం వదులుకునేందుకు సిద్ధమవుతున్నాయి అని చెప్పాలి ఇలా కొన్ని జట్లు తీసుకున్న నిర్ణయాలు అభిమానులను సైతం షాక్ కి గురిచేస్తున్నాయ్. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్  చరిత్రలో ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిచి ఏకంగా ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ముంబై ఇండియన్స్ గత ఏడాది పేలవ ప్రదర్శన చేసింది. వచ్చే సీజన్లో మాత్రం ఇలాంటిది పునరావృతం కాకుండా ఉండేందుకు ఎంతో పకడ్బందీ ప్లాన్ తో ముందుకు సాగుతుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే పేలవ  ప్రదర్శన చేసిన ఆటగాళ్లు అందరిని వదులుకుంటుంది.

 ఈ క్రమంలోనే 2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు 13 మంది ప్లేయర్లను వదులుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇందులో స్టార్ ప్లేయర్ కిరణ్ పోలార్డ్, అన్మోల్ ప్రీత్, ఆర్యన్ తంపి, డానియల్ సామ్స్, అలెన్, ఉనద్గత్, మార్కండే, మురుగన్ అశ్విన్, రాహుల్ బుద్ధి, సంజయ్ యాదవ్, మెరీడిత్, మిల్స్ ఉన్నారు అని చెప్పాలి. ఇక ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల లిస్టు చూసుకుంటే రోహిత్ శర్మ, డేవిడ్, రమన్ దీప్,  తిలక్ వర్మ సూర్యకుమార్, అర్జున్ టెండూల్కర్, ఇషాన్, స్టప్స్, బ్రేవిస్, ఆర్చర్, బుమ్రా, అర్షద్ ఖాన్ కార్తికేయలను రిటైన్ చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: