ప్చ్.. చెన్నై సూపర్ కింగ్స్.. ఆ నలుగురిని వదిలేసిందట?

praveen
ఐపీఎల్ ప్రారంభమైందంటే చాలు క్రికెట్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కి అడ్డాగా మారిపోతుంది ఈ లీగ్. ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఇక ఎప్పుడూ వ్యూస్ లో రికార్డులు సృష్టిస్తూ ఉంటుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇక ఈ దేశీయ లీగ్ లో ఆడటానికి విదేశీ ఆటగాల్లు సైతం ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే ఈ లీగ్ లో పాల్గొనడం వల్ల ఒకవైపు కోట్ల రూపాయల సంపాదన వెనకేసుకొవడమే కాదు.. ఇక మరోవైపు ఊహించని రీతిలో పాపులారిటీ కూడా సంపాదించుకోవచ్చు అని భావిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఇకపోతే ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పటికే ముగిసింది.  2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనుకున్న సమయానికి అనుకున్న విధంగా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఆయా జట్లు వదులుకోబోయే ఆటగాళ్ల వివరాలను తెలపాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా తమతో పాటు అంటిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలను ఇక వదులుకోబోయే ప్లేయర్స్ డీటెయిల్స్ ను కూడా బీసీసీఐకు అందజేస్తున్నాయి.

 ఈ క్రమంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎవరిని వదిలేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే రవీంద్ర జడేజాను వదిలేస్తారని ధోని అందుకు ఒప్పుకోలేదు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, శివం దూబే, ఋతురాజు గైక్వాడ్, దేవాన్ కాన్వే, ముఖేష్ చౌదరి, డ్వాన్ ప్రిటోరియస్, దీపక్ చాహార్ ను చెన్నై సూపర్ కింగ్స్ అంటిపెట్టుకుంది. ఇక నలుగురిని వదిలేసేందుకు సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. క్రిస్ జోర్డాన్, ఆడమ్ మిల్నే, నారాయన్ జగదీషన్, మిచల్ శాంట్నర్ లను  రిలీవ్ చేస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ బీసీసీఐకి నివేదిక ఇచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: