టీమిండియాలో అతన్ని చూస్తే భయమేస్తుంది : బెన్ స్టోక్స్
ఇక స్వయంగా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా స్పందిస్తూ టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ ల విధ్వంసం ఏ రీతిలో కొనసాగుతుంది అనే విషయంపై మాట్లాడుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ల గురించి మాట్లాడాడు. సరైన సమయంలో విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావడం మాకు ఇబ్బంది కలిగించే అంశం. ఒక్కోసారి విరాట్ కోహ్లీ ఆటను చూస్తుంటే భయమేస్తుంది. ఇప్పటికీ తాను ఏంటో మూడు ఫార్మాట్లలో తన సత్తా ఏంటో నిరూపిస్తూనే ఉన్నాడు. వరల్డ్ కప్ లో స్థిరత్వంతో పరుగులు సాధిస్తున్న కోహ్లీని తొందరగా అవుట్ చేయడమే మా లక్ష్యం అంటూ బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
ఇక సూర్య కుమార్ యాదవ్ తన సత్తా ఏంటో ప్రపంచానికి మొత్తం గట్టిగా చూపిస్తున్నాడు. అతను ఒక అద్భుతమైన ప్లేయర్ ఒక్కోసారి అతను కొట్టే షాట్లు నిస్సహాయ స్థితిలో తలలు గోక్కునేలా చేస్తాయి. అతను ఉన్న ఫామ్ ను తట్టుకోవడం చాలా కష్టం. వీలైనంత త్వరగా అతని పెవిలియన్ చేర్చడానికి ప్రయత్నిస్తాం అంటూ బెన్ స్టోక్స్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ తీరును ఆకాశానికి ఎత్తేసాడు అని చెప్పాలి. ఇక రేపు జరగబోయే మ్యాచ్లో ఎవరు బాగా రానిస్తారు అన్న విషయం చూడాలి మరి.