సూపర్.. సూపర్.. ఇండియా సెమీఫైనల్ కు వెళ్ళింది?

praveen
టీమిండియా అభిమానులు అందరూ కూడా సంబరాలు మునిగిపోయారు. దాదాపు ఒక గంట క్రితం వరకు కూడా ఎంతో టెన్షన్ తో ఉన్న అభిమానులు అందరూ కూడా ఇప్పుడు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఆనందానికి అవధులు లేవు మాటలు రావడం లేదు అని పెద్దపెద్ద డైలాగులు కూడా చెప్పేస్తూ ఉన్నారు టీం ఇండియా అభిమానులు. ఇలా టీమ్ ఇండియా అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగి పోవడానికి ఒక కారణం ఉంది.  అదే తమ అభిమాన జట్ట అయిన భారత జట్టు వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో అడుగుపెట్టడమే.

 ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో భాగంగా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించింది టీం ఇండియా.  గ్రూప్ 2 లో ఏ జట్టుకు సాధ్యం కాని రీతిలో ఇప్పటికే మూడు విజయాలు సాధించి అటు ఆరు పాయింట్లతో పాయింట్లు పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. రన్ రేట్ కూడా ఎంతో మెరుగ్గానే ఉంది అని చెప్పాలి. అయితే ఇటీవల సౌత్ ఆఫ్రికా జట్టు నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో ఇక టీమిండియా నేరుగా సెమి ఫైనల్లో అడుగుపెట్టింది. ఎందుకంటే ఒకవేళ నెదర్లాండ్స్ పై సౌత్ ఆఫ్రికా గెలిచి ఉంటే ఇక ఏడు పాయింట్లతో నెదర్లాండ్స్ పాయింట్ల పట్టికలో టాప్ లోకి వెళ్ళేది.

 ఈ క్రమంలోనే అటు టీమ్ ఇండియాకు జింబాబ్వేపై తప్పక గెలవాల్సిన పరిస్థితి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం జింబాబ్వే తో మ్యాజిక్ ముందే టీమిండియా సెమీఫైనల్ అడుగుపెట్టింది. ఎందుకంటే ప్రస్తుతం పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఇందులో ఎవరు గెలిచినా కూడా ఆరు పాయింట్లే సాధిస్తారు. దీంతో వారితో పోల్చి చూస్తే టీమిండియా మెరుగైన స్థితిలోనే ఉంది. దీంతో టాప్ లోనే కొనసాగే ఛాన్స్ ఉంది తద్వారా జింబాబ్వే తో మ్యాచ్ కూ ముందే టీమ్ ఇండియా సెమి ఫైనల్ అడుగు పెట్టేసింది అని చెప్పాలి. దీంతో భారత అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: