పాక్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది.. అరుదైన రికార్డ్?

praveen
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ మధ్య కీలకమైన మ్యాచ్ జరిగింది అని చెప్పాలి . ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో ఒకటిగా కొనసాగుతున్న పాకిస్తాన్ జట్టుకు మొదట్లోనే ఊహించని పరాభవం ఎదురయింది. ఏకంగా పటిష్టమైన భారత్ చేతిలో ఓడిపోవడమే కాదు పసికూన జింబాబ్వే చేతిలో కూడా ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు సెమిస్ అవకాశాలను ఎంతో కష్టతరం చేసుకుంది అని చెప్పాలి. అయినప్పటికీ పట్టు విడవకుండా పాకిస్తాన్ పోరాడుతూనే ఉంది. మొన్నటికి మొన్న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో భారీ తేడాతో విజయం సాధించిన పాకిస్తాన్ జట్టు ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో విజేయడంకా మోగించింది.

 ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్లు బాగా రాణించడంతో ఇక విజయం పాకిస్తాన్ వశం అయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక చావు రేవో తెలుసుకోవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ మంచి ప్రదర్శన చేసి విజయం సాధించడంతో.. సెమి ఫైనల్ వెళ్లే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉంచుకుంది అని చెప్పాలి. ఇక పాకిస్తాన్ చివరి మ్యాచ్ బంగ్లాదేశ్ తో ఆడబోతుంది. ఈ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది ఒక అరుదైన రికార్డు సృష్టించాడు.

 టి20 ఫార్మాట్లో 50 వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా షాహీన్ ఆఫ్రిది రికార్డు సృష్టించాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో మంచి ప్రదర్శన కనబరిచాడు. మూడు ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. కీలకమైన వికెట్లను తీసి ఏకంగా ప్రత్యర్థి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు అని చెప్పాలి. ఇలా సౌత్ ఆఫ్రికా తో మ్యాచ్లో మూడు వికెట్లు సాధించడం ద్వారా ఇక తన టి20 కెరియర్లో 50 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు షాహిన్ ఆఫ్రిది. తద్వారా ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: