సెమీఫైనల్ కు పాకిస్తాన్... "ఇలా జరిగితేనే" ?

VAMSI
కాసేపటి క్రితమే పాకిస్తాన్ మరియు సౌత్ ఆఫ్రికా ల మధ్యన జరిగిన సూపర్ 12 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగి చివరకు పాకిస్తాన్ డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ జరిగిన తీరు చూస్తే పాకిస్తాన్ గెలుస్తుందని అంచనా కూడా వేయలేని పరిస్థితి. నిన్న ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ లాగానే ఛేజింగ్ లో సౌత్ ఆఫ్రికా అద్భుతంగా ఆడింది. అప్పుడే వర్షం రావడంతో మొత్తం సీన్ అంతా మారిపోయింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిసాన్ ఒక దశలో సఫారీల దెబ్బకు కేవలం 43 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది.
కానీ ఆ తర్వాత జట్టును ఆదుకునే ప్రయత్నాన్ని ఇఫ్తికార్ అహ్మద్ మరియు షాదాబ్ ఖాన్ లు తీసుకున్నారు . వీరిద్దరూ 82 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీం కు భారీ స్కోర్ ను అందించి సౌత్ ఆఫ్రికా ముందు మంచి టార్గెట్ ను ఉంచారు. ఓపెనర్లుగా వచ్చిన డికాక్ మరియు రసౌ లు విఫలం కాగా, ఈసారి కెప్టెన్ బావుమా కుదురుకున్నాడు. అయితే పవర్ ప్లే తర్వాత స్పిన్ ను అంచనా వేయడంలో పొరపాటు చేసి వికెట్ ను సదాబ్ ఖాన్ కు ఇచ్చేశాడు బావుమా. ఆ వెంటనే మార్కురామ్ కూడా సదాబ్ కు బౌల్డ్ అయ్యాడు. ఆ దశలో వర్షం పడడంతో మ్యాచ్ ను నిలిపివేశారు. వర్షం ఆగిన తర్వాత డి ఎల్ ఎస్ ప్రకారం టార్గెట్ ను 14 ఓవర్లకు 142 పరుగులుగా కేటాయించారు.
కానీ నిన్నటిలాగే సౌత్ ఆఫ్రికా కూడా వర్షం తర్వాత బ్యాట్ ను జులిపించలేక చేతులెత్తేసింది. వరుసగా వికెట్లు కోల్పోయి భారీ విజయాన్ని పాకిస్తాన్ కు ముట్టచెప్పింది. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా నాలుగు మ్యాచ్ లలో 2 గెలిచి, ఒకటి ఒడి ఇంకొకటి వర్షం వల్ల రద్దయింది. ఇప్పుడు పాకిస్తాన్ కు కొద సెమీస్ కు వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే సౌత్ ఆఫ్రికా తర్వాత మ్యాచ్ లో ఓడిపోవడం లేదా వర్షం వల్ల మ్యాచ్ రద్దవడం జరగాలి. అప్పుడు పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ లో బంగ్లాపై భారీ తేడాతో గెలవాలి. ఇలా జరగడం ఒక అద్భుతమే అవుతుంది.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: