ఇండియా విజయం.. క్రెడిట్ మొత్తం అతనికి ఇచ్చేసిన రోహిత్?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న టీమ్ ఇండియా మరో విక్టరీ సొంతం చేసుకుంది అన్న విషయం తెలిసిందే   మొన్నటికి మొన్న దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయి నిరాశ పరిచిన టీమ్ ఇండియా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఉత్కంఠ భరితమైన పోరులో చివరికి ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఒకానొక దశలో బంగ్లాదేశ్ గెలుస్తుందేమో అన్న విధంగా పరిస్థితులు ఉన్నప్పటికీ భారత బౌలర్లు అద్భుతం చేసి చూపించారు.

 ముఖ్యంగా జట్టులో ఉన్న మిగతా బౌలర్లతో పోల్చి చూస్తే తక్కువ  అనుభవం మాత్రమే ఉన్న అర్షదీప్ సింగ్ ఎంతో వైవిద్యమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. కీలకమైన సమయం లో వికెట్లు తీసి అటు ప్రత్యర్థి బంగ్లాదేశ్ ఓటమిని శాసించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇక టీమిండియా విజయంతో సెమీస్ అవకాశాలను మరింత ఈజీ చేసుకుంది టీమ్ ఇండియా. అయితే బంగ్లాదేశ్ పై విజయం తర్వాత మాట్లాడిన రోహిత్ శర్మ ఇక టీమిండియా విక్టరీ క్రెడిట్ మొత్తాన్ని కూడా అర్షదీప్ సింగ్ కే ఇచ్చేశాడు.

 అతను బుమ్రా లేని లోటును తీరుస్తున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.  బంగ్లాదేశ్ ఇన్నింగ్స్  జరుగుతున్నప్పుడు మేము కాస్త ఒత్తిడికి లోనయ్యామ్.. బంగ్లాదేశ్ చేతిలో పది వికెట్లు ఉన్న సమయంలో కొంచెం భయమేసింది. అందులో వర్షం కూడా రావడంతో మా పని అయిపోయిందని అనుకున్నాం. కానీ వర్షం ఆగిన తర్వాత మా బౌలర్లు అద్భుతంగా రాణించారు  ముఖ్యంగా అర్షదీప్ సింగ్ అయితే అదరగొట్టేసాడు. ఈ మ్యాచ్ మొత్తానికి హీరో అతనె. ఒత్తిడిలో బౌలింగ్ చేయడం అనేది సవాలతో కూడుకున్నది. అందుకే డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయడం కత్తి మీద సాము లాంటిది. అలాంటిది డెత్ ఓవర్స్ లో అతను ఎంతో అద్భుతంగా బౌలింగ్ చేశాడు అంటూ అర్షదీప్ ని ఆకాశానికేత్తేశాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: