వరల్డ్ కప్.. ఐసీసీ గుర్తించిన 5 థ్రిల్లింగ్ మ్యాచ్లు ఇవే?

praveen
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పసికూన జట్లు అని తక్కువ అంచనా వేస్తే ఇక ఆ పసికూన జట్లే ఛాంపియన్ జట్లకు షాక్ ఇస్తూ విజయాలు సాధిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ప్రేక్షకుల ఊహకుందని రీతిలో ఫలితాలు వెలబడుతూ ఉత్కంఠ భరితంగా సాగుతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఫైనల్ ఓవర్ వరకు ఉత్కంఠ మధ్య జరిగిన టాప్ 5 మ్యాచ్లను ఇటీవల వెల్లడించింది.. ఆ వివరాలు చూసుకుంటే..

 1. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ : ఐసీసీ వెల్లడించిన సూపర్ త్రిల్లింగ్ మ్యాచ్ లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టాప్ లో నిలిచింది అని చెప్పాలి. అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఈ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకు సాగింది. ఇక ఆఖరి ఓవర్లో ఎన్నో నాటకీయ పరిణామాలు కూడా చోటు చేసుకోగా.. నాలుగు వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది.

 పాకిస్తాన్ వర్సెస్ జింబాబ్వే  : ఇక ఐసీసీ విడుదల చేసిన థ్రిల్లింగ్ మ్యాచ్ ల లిస్టులో పాకిస్తాన్, జింబాబ్వే మ్యాచ్ రెండవ స్థానంలో నిలిచింది. టి20 క్రికెట్లో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని.. ఎప్పుడు ఎవరు విజేతగా నిలుస్తారో ముందుగా అంచనా వేయలేం అన్న విషయాన్ని ఈ మ్యాచ్ నిరూపించింది. పాకిస్తాన్ పై జింబాబ్వే గెలిచింది.

 స్కాట్లాండ్ వర్సెస్ ఐర్లాండ్ : అక్టోబర్ 19వ తేదీన స్కాట్ ల్యాండ్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. 61 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో కూరుకుపోయిన ఐర్లాండ్ ను కార్టిన్ కంఫర్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో తిరిగి విజయం వైపు నడిపించగా.. ఓడిపోతుంది అనుకున్న ఐర్లాండ్  విజయం సాధించింది.

3. యూఏఈ వర్సెస్ నెదర్లాండ్స్  : ప్రపంచ కప్ ఆరంభ తేదీ అయిన అక్టోబర్ 16వ తేదీన జరిగిన ఈ మ్యాచ్ ఆఖరి బంతి వరకు ఉత్కంఠ గా నిలిచింది. పసికూన జట్లు అయినప్పటికీ ప్రేక్షకులకు అసలు సిసలైన కిక్ అందించాయి. ఇక ఈ మ్యాచ్లో ఏకంగా మూడు వికెట్ల తేడాతో యూఏఈ పై నెదర్లాండ్స్ విజయం సాధించడం గమనార్హం.
 నమీబియా వర్సెస్ యూఏఈ  : ఈనెల 20వ తేదీన గ్రూపులో ఉన్న నమీబియా యూఏఈ మధ్య జరిగిన పోరు ఎంత ఉత్కంఠ గా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరికి నామీబియా సూపర్ 12 చేరాలని ఆశలపై నీళ్లు చల్లిన యూఏఈ జట్టు నెదర్లాండ్స్కు సూపర్ 12 అవకాశాన్ని కల్పించింది అని చెప్పాలి. నమీబియా పై ఏడు పరుగుల తేడాతో యూఏఈ విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: