జింబాబ్వే సక్సెస్ వెనుక ఇండియా మాజీ కోచ్...అదరహో !

VAMSI
ప్రస్తుతం ప్రపంచ కప్ లో చిన్న జట్లు తమ సత్తా చాటుతున్నాయి. ఈ లీగ్ మొదట్లో అసలు జింబాబ్వే లాంటి జట్టు వెస్ట్ ఇండీస్ మరియు స్కాట్లాండ్ లాంటి జతను దాటి సూపర్ 12 చేరుతుందా అనిపించింది. కానీ జింబాబ్వే జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. ఏకంగా గ్రూప్ స్టేజ్ లో కీలక మ్యాచ్ లలో గెలిచి జింబాబ్వే సూపర్ 12 కు దూసుకువచ్చింది. అయితే ఇది కేవలం గాలి వాటం వల్లనే జరిగింది అని ఆరోజు అంతా కామెంట్స్ చేశారు. కానీ మొన్న జరిగిన పాకిస్తాన్ మ్యాచ్ లో స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుని గెలిచిన తీరు అసలు సిసలైన టీం అని రుజువు చేసింది. ఇప్పుడు జింబాబ్వే గెలిచింది అన్నదాని కన్నా కూడా, పాకిస్తాన్ ఓడిపోయింది అన్నది ఎక్కువ గా వైరల్ అయింది.
అయితే జింబాబ్వే ఇంతలా వరల్డ్ కప్ లో సక్సెస్ ఫుల్ గా సాగిపోవడానికి తెరవెనుక ఎన్నో విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇండియా మాజీ ప్లేయర్ లాల్ చంద్ రాజ్ పుత్... ఇతని పేరు ఇప్పట్లో ఉన్న చాలామందికి తెలియకపోయినా ఇతను ఇండియాకు కీలక ప్లేయర్ గా తన సేవలను అందించాడు. ఇతను ఆర్ధికంగా, ఆట పరంగా పూర్తిగా తేలిపోయిన జింబాబ్వే జట్టుకు కోచ్ గా 2018 లో నియమితుడయ్యాడు. అప్పటి నుండి మెల్ల మెల్లగా ఈ జట్టును తన ప్రతిభతో ప్రతి ఒక్క ఆటగాడిలోని సామర్ధ్యాన్ని బయటకు తీసి ఛాంపియన్ గా తయారుచేశాడు. ఆ విధంగా కోచ్ గా బాధ్యతలు చేప్పట్టిన ఒక్క సంవత్సరానికి జింబాబ్వే క్రికెట్ టెక్నికల్ డైరెక్టర్ గా అయ్యాడు. ఈ రోజు జింబాబ్వే మైదానంలో చిరుతలా బాల్ ను అందుకుంటూ, బౌండరీలు ఆపేస్తూ ఉందంటే అది లాల్ చంద్ రాజ్ పుత్ వలనే అని చెప్పాలి.
గతంలో అయితే జింబాబ్వే కు ప్లవర్ సోదరులు, నీల్ జాన్సన్, హీత్ స్ట్రీక్ , ఒలంగా లాంటి ఆటగాళ్లు మ్యాచ్ విన్నర్ లుగా ఉండేవారు. కానీ గత మూడు సంవత్సరాల క్రితం వరకు కూడా జింబాబ్వే పరుగులు చేయడానికి చాలా కష్టపడేది, నిలకడగా ఆడడంలో పూర్తిగా విఫలం అయ్యేది. కానీ లాల్ చంద్ రాజ్ పుత్ ఆధ్వర్యంలో అద్భుతంగా ట్రైన్ అయ్యి ఇప్పుడు పెద్ద టీం లకు సైతం సవాల్ విసిరేలా చేశాడు. ముఖ్యంగా ప్రస్తుతం టీం లో ఉన్న సీనియర్ ఆటగాళ్లు అయిన సికందర్ రాజా , విలియమ్స్, ఇర్విన్ లాంటి వాళ్లకు తమ బాధ్యతను గుర్తు చేసి ఆచరణలో పెట్టేలా చేశాడు. అలా ప్రపంచ కప్ లో జింబాబ్వే సక్సెస్ కు కారణం మన ఇండియా ఆటగాడి అన్నది తెలుసుకోండి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: