ఆస్ట్రేలియా గడ్డపై పాక్ గెలవదు.. హిస్టరీ ఏం చెబుతుందంటే?

praveen
ఏడాది టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో అటు భారత దాయాది దేశమైన పాకిస్తాన్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. బలమైన ఫేస్ దళం పటిష్టమైన బ్యాటింగ్ విభాగం పాకిస్తాన్ లో ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ మ్యాచ్ లలో పాకిస్తాన్ నుంచి అన్ని జట్లకు కూడా గట్టి పోటీ ఉంటుందని ఎంతో మంది విశ్లేషకులు కూడా అంచనా వేశారు. విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే అటు వరల్డ్ కప్ లో భాగంగా భారత్తో జరిగిన మొదటి మ్యాచ్లో పాకిస్తాన్ విజృంభించింది అని చెప్పాలి.

 ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టు బ్యాటింగ్ విభాగాన్ని కట్టడి చేయడంలో అటు పాకిస్తాన్ సక్సెస్ అయింది. విరాట్ కోహ్లీ వీరబాదుడు బాదాడు కాబట్టి భారత్ విజయం సాధించింది. కానీ లేదంటే పాకిస్తాన్ బౌలర్లు దాటికి భారత్ ఓటమిపాలు అయ్యేది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా భారత్తో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన ఆట తీరు కనబరిచిన పాకిస్తాన్ అటు ఆ తర్వాత జరిగిన మ్యాచ్ లో మాత్రం పసికూని జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 130 పరుగులను కూడా చేదించలేక పాకిస్తాన్ జింబాబ్వే బౌలర్ల  దాటికి చేతులెత్తేసింది అని చెప్పాలి. తద్వారా వరుసగా రెండవ ఓటమి నమోదు చేసింది.

 ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగానే పాకిస్తాన్ జట్టుకు ఆస్ట్రేలియా గడ్డపై అస్సలు కలిసి రాదట. ఆస్ట్రేలియా గడ్డపై అంతర్జాతీయ టి20లో పాకిస్తాన్ కు ఒక చెత్త రికార్డు ఉంది. ఇప్పుడు వరకు అక్కడ ఆడిన ఒక్క టి20 మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ విజయం సాధించకపోవడం గమనార్ధం. ఇప్పుడు వరకు జింబాబ్వే మూడు, ఐర్లాండ్ 3, నెదర్లాండ్స్ రెండు, నమీబియా 1, స్కాట్లాండ్ ఒకటి, యూఏఈ ఒకటి విజయం సాధించాయి. కానీ ప్రపంచ ఛాంపియన్, వరల్డ్ క్లాసు ప్లేయర్లు కలిగిన పాకిస్తాన్ కు మాత్రం ఆస్ట్రేలియా గడ్డపై టి20 ఫార్మాట్లో ఇప్పటివరకు ఒక్క విజయం కూడా దక్కకపోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: