ఐపీఎల్ వేస్ట్ కాదు.. దానివల్లే నేను ఇక్కడున్న : స్టోయినిస్

praveen
ఇటీవలకలలు బీసీసీఐ నిర్వహించి ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై విమర్శలు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది అని చెప్పాలి. ఒకవైపు ఇంగ్లాండ్ ఆటగాళ్లు విఫలం అయినా, మరోవైపు భారత ఆటగాళ్లు సరిగ్గా రాణించక గాయాల బారిన పాడిన కూడా ఐపీఎల్ కారణమంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అక్కసు వెళ్ళగకుతున్నారు  ఇంగ్లాండ్ జట్టు నుంచి అటు ఐపిఎల్ లో ఆడే క్రికెటర్లు తక్కువ అయినప్పటికీ ఇక వారు విఫలం అయినప్పుడు అబాండాను ఎవరు మీద మోపాలో తెలియక చివరికి ఐపీఎల్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు.

 ఇలా ఇప్పటివరకు ఐపీఎల్ పై విమర్శలు చేసిన మాజీ ఆటగాళ్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఐపీఎల్ వళ్లే తాను స్టార్ క్రికెటర్గా ఎదిగాను అంటూ చెబుతున్నాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మార్గస్ స్టోయినిస్. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ చేతుల్లో ఏకంగా ఆతిథ్య ఆస్ట్రేలియా 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుని శ్రీలంకపై ఏడు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. అయితే అప్పటికే కీలకమైన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజు లోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ 18 బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లతో 59 పరుగులు చేసి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు.

 ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ని ఏకంగా 17వ ఓవర్ లోనే ముగించి జట్టుకు విజయాన్ని అందించాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ తన సక్సెస్ క్రెడిట్ మొత్తం ఐపిఎల్ కే దక్కుతుందని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ వల్ల నా క్రికెట్ పూర్తిగా మారిపోయింది. ఆటలో ఎలా భాగం కావాలి గేమ్ ఎలా రీడ్ చేయాలనే విషయాలను బాగా అర్థం చేసుకున్నాను. ఐపీఎల్ కారణంగా కష్టమైన పిచ్ ల మీద ఎలా ఆడాలో తెలియడమే కాదు.. అత్యుత్తమ కోచ్ లు వరల్డ్ బెస్ట్ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం వల్ల ఇక వారి నుంచి విలువైన సలహాలు నేర్చుకునే అవకాశం దక్కిందని మార్గస్ స్టోయినిస్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

IPL

సంబంధిత వార్తలు: