ఒక్క ఇన్నింగ్స్ తో మూడు రికార్డులు బ్రేక్.. వారెవ్వా కోహ్లీ?

praveen
ఈనెల 23వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య టి20 వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ జరిగింది. అయితే ఈ దాయాదుల సమరం గురించి అటు క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో ఎదురు చూడగా ఇక ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే నరాలు తిరిగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ దాయాదుల పోరులో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి క్లిష్ట సమయంలో తనదైన ఆట తీరితో జట్టుకు విజయాన్ని అందించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్లేయర్ ఆఫ్ ది అవార్డును కూడా దక్కించుకున్నాడు. అయితే పాకిస్తాన్ భారత్ మ్యాచ్ జరిగి రోజులు గడుస్తున్న ఈ మ్యాచ్ కి సంబంధించిన చర్చ మాత్రం ఆగడం లేదు.

 నిన్న మొన్నటి వరకు విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ గురించి అతను కొట్టిన సిక్సర్ ల గురించి చర్చించుకున్న అభిమానులు.. ఇక ఇటీవలే పాకిస్తాన్తో మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ కారణంగా విరాట్ కోహ్లీ సాధించిన రికార్డుల గురించి సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో రికార్డుల రారాజుగా పేరు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ పాకిస్తాన్ తో మెరుపు ప్రదర్శన కారణంగా కూడా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఏకంగా ఓకే ఇన్నింగ్స్ తో మూడు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ.

 అంతర్జాతీయ టి20 లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇప్పటివరకు ఏకంగా 14 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. తర్వాత స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు నబి 13 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అదే సమయంలో టి20 వరల్డ్ కప్ లో ఎక్కువ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు పొందిన క్రికెటర్గా కోహ్లీ ఘనత సాధించాడు.. ఏకంగా ఆరుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు  కోహ్లీ తర్వాత ఐదు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు  సాధించి క్రిస్ గేల్  తర్వాత స్థానంలో ఉన్నాడు. ఇక టి20 లో చేజింగ్ చేస్తూ ఎక్కువ సార్లు నాటౌట్ గా నిలిచిన క్రికెటర్ గా కూడా షోయబ్ అక్తర్ రికార్డును బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: