ఆసియా కప్ విజేత.. టీమిండియాకు ప్రైజ్ మనీ ఎంతంటే?

praveen
ఇటీవలే జరిగిన మహిళల ఆసియా కప్ లో భాగంగా అటు భారత జట్టు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి మ్యాచ్ నుంచి తమ ఆధిపత్యం కొనసాగిస్తూ దూసుకుపోయిన భారత జట్టు చివరికి ఫైనల్ లో శ్రీలంక ను చిత్తుగా ఓడించి ఏడోసారి అటు మహిళ ఆసియా కప్ లో విజేతగా నిలిచింది అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఈ ఏడాది మహిళల ఆసియా కప్లో భారత్ చేతిలో ఓడిపోయిన శ్రీలంక జట్టు టీమిండియా చేతిలో ఫైనల్లో ఓడిపోవడం ఐదోసారి కావడం గమనార్హం.

 అయితే ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఎక్కడ ప్రత్యర్థి శ్రీలంక జట్టుకు అవకాశం ఇవ్వలేదు టీమిండియా.  ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ఇక ఉమెన్స్ టీమ్ ఇండియా జట్టు అటు ఆసియా కప్ విజేతగా నిలవడంపై ఎంతోమంది క్రికెట్ విశ్లేషకులు మాజీ ప్లేయర్స్ కూడా భారత్ జట్టు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారూ అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఆసియా కప్ విజేతగా నిలిచిన టీమిండియా మహిళల జట్టుకు ఎంత ప్రైజ్ మనీ సొంతం చేసుకుంది అన్న విషయం కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది  అంతేకాకుండా ఆసియా కప్ రన్నరప్ గా నిలిచిన శ్రీలంకకు ఎంత ప్రైజ్ మనీ వచ్చింది అన్న విషయం తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ఇక ఒకసారి ఆ వివరాలు చూసుకుంటే... వరుస విజయాలతో దూసుకుపోయి ఆసియకప్ విజేతగా నిలిచిన టీమిండియా మహిళలు జట్టుకు ప్రైజ్ మనీ రూపంలో 20,000 డాలర్లు వచ్చాయి అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు పదహారు లక్షల 40 ఎనిమిదివేల రూపాయలు ప్రైజ్ మనీగా లభించింది. ఇందుకు సంబంధించిన చెక్ టోర్ని నిర్వహకులు భారత జట్టు కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ కు అందజేశారు. అదేవిధంగా రన్నరప్ గా  నిలిచిన శ్రీలంకకు 12,500 డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు పది లక్షల 30000 రూపాయలు ప్రైజ్ మనీ దక్కింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: