ప్చ్.. వరల్డ్ కప్ నుంచి టీమిండియా ఔట్?

praveen
ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆస్ట్రేలియా వేదికగా రేపటి నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ గురించి చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ లో అయితే ఈ వరల్డ్ కప్ కు సంబంధించిన చర్చ ఎక్కువగా జరుగుతుంది అని చెప్పాలి.  ఎందుకంటే భారత్లో క్రికెట్కు ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే కొన్ని కొన్ని సార్లు క్రికెట్కు ఉన్న క్రేజ్ కారణంగా మిగతా విభాగాలకు సంబంధించిన క్రీడలకు మాత్రం అన్యాయం జరుగుతూ ఉంటుంది   ఎందుకంటే  ఇతర క్రీడలకు సంబంధించిన టోర్నీలు జరిగిన కూడా  ఆ టోర్నీలకు  సంబంధించిన వార్తలు పెద్దగా కనబడవు అని చెప్పాలి. ఇక ఆయా టోర్నీలలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది అన్న విషయంపై కూడా ఎవరు పెద్దగా పట్టించుకోరు..

 ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ కు సంబంధించిన చర్చ ఇండియాలో తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఇక ఇండియా వేదికగా జరుగుతున్న అండర్ 17 ఫిఫా ఫుట్బాల్ కప్ కి సంబంధించి ఎవరు చర్చించుకోవడం లేదు అని చెప్పాలి. ఇకపోతే అండర్ 17 ఫుట్బాల్ ప్రపంచ కప్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. అండర్ 17 ఫుట్బాల్ ప్రపంచకప్ లో సత్తా చాటాలని బరిలోకి దిగిన అమ్మాయిల జట్టు చివరికి నిరాశతో ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.

 వరుసగా రెండు ఓటములు చవిచూడటంతో చివరికి టీమిండియా మహిళల ఫుట్బాల్ జట్టుకి నిరాశ ఎదురయింది అని చెప్పాలి. తొలి మ్యాచ్ లో భాగంగా యుఎస్ఎతో తలబడిన భారత మహిళల జట్టు 0- 8 తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఇక ఇటీవలే మొరాకోతో జరిగిన మ్యాచ్లో కూడా 0-3 తేడాతో ఓడిపోయింది అని చెప్పాలి.. దీంతో భారత జట్టు నాకౌట్కు చేరుకోలేక ఇక ఇంటి దారి పట్టే పరిస్థితి వచ్చింది. అయితే నామమాత్రమైన చివరి గ్రూప్ మ్యాచ్ బ్రెజిల్ తో ఈ నెల 17వ తేదీన జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: