టీమిండియా విజయం.. మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్?

praveen
ఇటీవల జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని అక్టోబర్ రెండవ తేదీన దేశ వ్యాప్తంగా ఎంతో ఘనం గా నిర్వహించుకున్నారు అన్న విషయం తెలిసిందే . ప్రజా ప్రతినిధుల దగ్గర నుంచి అధికారుల వరకు సామాన్య ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కూడా మహాత్మా గాంధీ జయంతిని జరుపుకున్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి రోజునే అటు టీం ఇండియా రెండవ టి20 మ్యాచ్ ఆడింది. గౌహతి వేదిక గా జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో ఇండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

 ఉత్కంఠ భరితం  గా సాగిన పోరు లో 16 పరుగుల తేడా తో విజయం సాధించింది టీమిండియా. తద్వారా మూడు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగం  గా వరుసగా రెండు విజయాలు సాధించి ఇంకొక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి. ఇక ఇలా గాంధీ జయంతి రోజున టీమిండియా గెలవడంతో భారత క్రికెట్ అభిమానులందరూ ఆనందం లో మునిగిపోయారు. ఇలాంటి సమయంలోనే భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి. భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు.

 ఈ క్రమంలోనే భారత ఆటగాళ్ల అద్భుతమైన బ్యాటింగ్ చూసి అభిమానులు అందరూ కూడా పండగ చేసుకున్నారు.  కాగా భారత ఆటగాళ్ల తీరుపై వసీం జాఫర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శాంతికి మారుపేరైన గాంధీ జయంతి రోజున సౌత్ ఆఫ్రికాకు వ్యతిరేకంగా ఇంత హింసా?  అంటూ కామెంట్ చేశాడు. ఇక దీనిపై స్పందిస్తున్న ఎంతో మంది నెటిజెన్లు తమ జట్టు విజయం సాధించినప్పుడు ఆనందపడటం లో ఇక హింస ఏముంది అంటూ కామెంట్ చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: