కోహ్లీలో పరుగులు దాహం పెరిగింది : మాజీ బ్యాటింగ్ కోచ్

praveen
అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల యంత్రం, రికార్డుల రారాజు అంటూ ఎన్నో రకాల బిరుదులు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ.. ఒక అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్నాడు అని చెప్పాలి. ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ ఇంకా రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. అయితే సాధారణంగా ఏ ఆటగాడి కెరియర్లో అయినా సరే ఎత్తు పల్లాలు సహజం. అద్భుతంగా రాణించిన ఆటగాళ్లు ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్నిసార్లు మొన్నటి వరకు విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే కొన్నాళ్లపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆసియా కప్ లో మళ్ళీ జట్టుతో కలిసిన విరాట్ కోహ్లీ తన మునుపటి ఫామ్ అందుకున్నాడు అని చెప్పాలి. అంతేకాదు మూడేళ్ల పాటు అభిమానులు నిరీక్షణగా ఎదురుచూస్తున్న సెంచరీ దాహాన్ని కూడా తీర్చేశాడు. ఇక ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన టి20 సిరీస్ లో కూడా మూడో టి20 మ్యాచ్ లో బాగా రాణించాడు విరాట్ కోహ్లీ. 43 బంతుల్లో 68 పరుగులు చేశాడు.  జట్టు విజయంలో కీలకపాత్ర వహించాడు అని చెప్పాలి.

 ఇకపోతే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శన పై ఇటీవల ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. ఉప్పల్ వేదికగా జరిగిన కీలకమైన పోరులో విరాట్ కోహ్లీ ఎక్కడ రిలాక్స్ అయినట్లు అతని బాడీ లాంగ్వేజ్ లో కనిపించలేదు అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ బంగర్. ఆసియా కప్ లో బాగా రాణించిన తర్వాత విరాట్ కోహ్లీ తన మునుపటి బ్యాటింగ్ లయను అందుకోవడమే కాదు పరుగుల దాహం కూడా ఎక్కువైంది అన్న విషయం మాత్రం అర్థమవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.  ఆసియా కప్ కి ముందు విరాట్ కోహ్లీ విరామం తీసుకున్న తర్వాత ఇక ఇప్పుడు మరింత అద్భుతంగా రానిస్తున్నాడు అంటూ సంజయ్ బంగర్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: