హార్దిక్ పాండ్యాకు రెస్ట్.. జట్టులోకి ఎవరొస్తున్నారో తెలుసా?

praveen
గత కొంతకాలం నుంచి టీం ఇండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా  కొనసాగుతు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు స్టార్ ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా.  ఆల్ రౌండర్ అనే పదానికి తన పరిరక్షణతో అసలు సిసలైన అర్ధాన్ని చెబుతూ ఉన్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అటు టీం ఇండియాలో హార్థిక్ పాండ్యా ఎంతో కీలకంగా మారబోతున్నాడు అన్నది మాత్రం తెలుస్తుంది. ఇలాంటి సమయంలోనే ఇక హార్థిక్ పాండ్యా కు వీలైనంత రెస్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో టీమ్ ఇండియా యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.

 ఇకపోతే ఇటీవల భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టి20 సిరీస్ లో భాగంగా హార్దిక్ పాండ్యా జట్టులో భాగం అయ్యాడు. కానీ వరల్డ్ కప్ దృశ్య మరి కొన్ని రోజుల్లో భారత పర్యటనకు రాబోతున్న సౌత్ ఆఫ్రికా తో జరగబోయే టి20 సిరీస్ కు మాత్రం హార్థిక్ పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలని టీమ్ ఇండియా యాజమాన్యం భావిస్తుంది అనేది తెలుస్తుంది. అయితే ఇక హార్దిక్ పాండ్యా స్థానంలో యువ ఆటగాడు షాబాజ్ అహ్మద్ను జట్టులోకి తీసుకోవాలని టీమ్ ఇండియా యాజమాన్యం భావిస్తోందట.

 అంతేకాకుండా అటు సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో జరగబోయే టి20 సిరీస్లో కీలక మార్కులు చేసే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. ఇటీవల ఈ విషయాన్ని క్రిక్బజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది.   సౌత్ ఆఫ్రికా తో సిరీస్ ఎంపికైన సీనియర్ బౌలర్ షమి కరోనా వైరస్ బారిన పడ్డాడు. ఈ క్రమంలోని అతను ఇంకా కోలుకోలేదని అతని స్థానంలో ఉమేష్ యాదవ్  కంటిన్యూ అవుతాడు అంటూ క్రిక్బజ్ పేర్కొంది. ఇక దీపక్ హుడాకు గాయం కావడంతో శ్రేయస్ అయ్యర్  జట్టులోకి వస్తాడు అంటూ తెలిపింది. ఇలా పలు మార్పులతో సౌత్ ఆఫ్రికా తో జరగబోయే టి20 సిరీస్ లో బరిలోకి దిగనుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: