పార్థివ్ పటేల్ కి లక్కీ ఛాన్స్.. ఎమ్ఐ ఎమిరేట్స్ కోచ్ గా?

praveen
బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ యూఏఈలో కూడా టీ20 లీగ్ జరగబోతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టి 20 లీగ్ కూడా అచ్చం ఐపీఎల్ తరహాలోనే ఉండబోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే యూఏఈ టి20 లీగ్ లో భాగంగా ఉన్న జట్లను అటు ఐపీఎల్ లోనీ ఫ్రాంచైజీలే కొనుగోలు చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే ఎమిరేట్స్ జట్టును కొనుగోలు చేసింది ఇకపోతే ఎమ్ఐ ఫ్రాంచైజీ. కాగా ఇటీవలే షాకింగ్ నిర్ణయం తీసుకుంది అని తెలుస్తోంది. తమ జట్టుకు ప్రధాన కోచ్గా షేన్ బాండ్ ను నియమించింది.

 అదే సమయంలో ఇక టీమిండియా మాజీ క్రికెటర్లు పార్థివ్ పటేల్ ను బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక మరో టీమిండియా మాజీ క్రికెటర్ వినయ్ కుమార్ ను బౌలింగ్ కోచ్ గా ఎంపిక చేసినట్లు తెలిపింది.. అయితే న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ తమ జట్టు ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.  ఇక ఇటీవలే ఎంఐ ఎమిరేట్స్ యాజమాన్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలే అధికారిక ప్రకటన చేసింది అని చెప్పాలి. కాగా షేర్ బాండ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టు బౌలింగ్ కోచ్ గా సేవలందించాడు.

 కాగా 2015 నుంచి ముంబై ఇండియన్స్ తో అతని ప్రయాణం కొనసాగుతూనే ఉంది.  ముంబై ఇండియన్స్ జట్టు 4 సార్లు టైటిల్ గెలవడంలో తనదైన పాత్ర వహించాడు..  ఇకపోతే ఇటీవలే షేన్ బాండ్ ఎమ్ఐ ఎమిరేట్స్ జట్టుకు ప్రధాన కోచ్గా  ఎంపిక కావడంపై స్పందిస్తూ ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.  ఆటగాళ్లలో స్పూర్తిని నింపుతూ ఎమ్ఐ  ఎమిరేట్స్ స్థాయిని మరింత పెంచేందుకు కృషి చేస్తానంటూ వెల్లడించాడు. కాగా యూఏఈ వేదికగా క్రికెట్ లీగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mi

సంబంధిత వార్తలు: