అలా జరిగితే.. గంగూలి, జై షా పదవులు పోయినట్టేనా?

praveen
ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ సెక్రెటరీ  పదవిలో కొనసాగుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జై షా వీరిద్దరి పదవులు ప్రస్తుతం ప్రమాదం లో పడిపోయాయా అంటే ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ అవును అనే. ఎందుకంటే గత కొంత కాలం నుంచి కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ మండలి నియమావళి లో అమలవుతున్న లోదా కమిటీ సిఫారసుల సవరణల పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.

 ఈ క్రమంలోనే 70 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితి పదముల మధ్య విరామం నిబంధనలని సవరించేందుకు ఇక ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు వాడివేడిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.  ఇక బీసిసిఐ తరపున మాజీ కేంద్ర మంత్రి సీనియర్ న్యాయవాది అయిన కపిల్సిబాల్ వాదనలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బోర్డు పరిపాలనలో విశేష అనుభవజ్ఞులు అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం 70 ఏళ్ల వయోపరిమితి నిబంధన తొలగించాలని సుప్రీంకోర్టును కోరారు.

 ఈ క్రమంలోనే స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా లో 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఉన్నారా.. ఒకవేళ ఉంటే వారి వివరాలు వెంటనే సమర్పించాలి అంటూ కోరింది. ఇక పదవుల మధ్య విరామం విషయంలో పన్నెండేళ్లు ఏకతాటిగా కొనసాగాలని బిసిసిఐ బోర్డు కోరుకోవడం లేదని అయితే ఆరేళ్లు బీసీసీఐ లో పని చేసిన తర్వాత తిరిగి రాష్ట్ర సంఘం లో పని చేసేందుకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు మాత్రం మూడేళ్ల చొప్పున రెండు దఫాలుగా కొనసాగిన ఆఫీస్ బేరర్ కు విరామం ఉండాల్సిందే అంటూ అభిప్రాయపడింది. ఒకవేళ  ఇదే జరిగితే కనుక బిసిసీఐ అధ్యక్ష కార్యదర్శులుగా ఉన్నా సౌరవ్ గంగూలీ, జై షా ల  పదవులు ఊడటం ఖాయం అని తెలుస్తోంది. ఇక ఇది అర్థం చేసుకునే కపిల్సిబాల్ ను బీసీసీఐ రంగంలోకి దింపింది అనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: