స్మిత్ దెబ్బకు.. మూడో వన్డే కూడా పాయే.. కివిస్ క్లీన్ స్వీప్?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ వన్డే సిరీస్లో భాగంగా అటు ఆస్ట్రేలియా జట్టు న్యూజిలాండ్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది. అయితే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించిన ఆస్ట్రేలియా జట్టు ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే మూడో వన్డే సిరీస్లో అయినా న్యూజిలాండ్ జట్టు పుంజుకుంటుందని కనీసం ఒక మ్యాచ్ లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకుంటుందని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో మూడో వన్డే మ్యాచ్లో కూడా న్యూజిలాండ్ జట్టు పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది. దీంతో మూడో మ్యాచ్లో కూడా ఓడిపోయింది అని చెప్పాలి.

 తద్వారా ప్రత్యర్థి న్యూజిలాండ్ పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడు మ్యాచ్లలో విజయం సాధించి 3-0 తేడాతో న్యూజిలాండ్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పాలి. కాగా మూడో వన్డే మ్యాచ్లో స్మిత్ 105 పరుగులు చేసి సూపర్ సెంచరీతో చెలరేగాడు. తద్వారా ఆస్ట్రేలియా జట్టు 25 పరుగుల తేడాతో విజయకేతనం ఎగురవేసింది.  టాస్ ఓడి పోయిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే స్టీవ్ స్మిత్ సెంచరీ లబుషేన్ (52) అలెక్స్ క్యారీ (42) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది ఆస్ట్రేలియా.

 268పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఆరంభం నుంచే తడబడుతూ ఆడింది అని చెప్పాలి.. ఈ క్రమంలోనే తక్కువ పరుగులకే న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు అందరూ వికెట్లు కోల్పోయి పెవిలియన్ బాట పట్టారు. చివరికి ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 268 పరుగుల లక్ష్యాన్ని చేదించ లేక 26 పరుగుల దూరంలో ఆగిపోయారు. మరో బంతి మిగిలి ఉండగా 242 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది న్యూజిలాండ్ జట్టు. తద్వారా ఇక ఆస్ట్రేలియా జట్టు మూడో వన్డే మ్యాచ్లో కూడా 26 పరుగుల తేడాతో రాణించి 3-0 తో క్లీన్స్వీప్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: