అందరూ కింగ్ ఈజ్ బ్యాక్ అంటుంటే.. CSK మాత్రం ఆసక్తికర ట్వీట్?

praveen
విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో చర్చనీయాంశంగా మారి పోయాడు. ప్రతి ఒక్కరు కూడా ఇతని గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే దాదాపు మూడేళ్ల నుంచి సెంచరీ అనే పదానికి చాలా దూరం వెళ్లి పోయాడు విరాట్ కోహ్లీ . పేలవ  మైన ఫామ్లో ఉన్నాడు. అతని పని అయిపోయింది అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఆసియా కప్లో భాగంగా ఆప్ఘనిస్తాన్లో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించాడు. 60 బంతుల్లో 122 పరుగులు చేసి మెరుపు సెంచరీ చేశాడు. తన కెరీర్లో 71 సెంచరీ ఇక టి20 కెరీర్ లో మొదటి సెంచరీ నమోదు చేసి తనకు తిరుగు లేదు అని నిరూపించాడు విరాట్ కోహ్లీ.

 ఈ క్రమంలోనే అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అని చెప్పాలి. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ పొగిడేస్తున్నారు.  ఇక కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు.. మళ్ళీ పరుగుల వరద పారించేందుకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. ఫ్యాన్స్ దగ్గర నుంచి మాజీ క్రికెటర్ల వరకు అందరూ కూడా విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ పై స్పందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇక ఐపీఎల్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 విరాట్ కోహ్లీ సెంచరీ చేయగానే కింగ్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. అతడు ఆటలు ఎప్పుడైనా విడిచి పెట్టాడా.. లేదు కదా. పోరాటాల్లో ఎప్పుడూ అతను ముందే వున్నాడు. యుద్ధాలను.. విమర్శలను ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్నాడు. ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు.  ఓ యోధుడికి ఎలాంటి అడ్డంకులు ఆపలేవు. క్రికెట్ ఇంకా మిగిలే ఉంది.. విజిల్ పోడు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తన ట్విట్టర్ ఖాతాలో విరాట్ కోహ్లీ ఆటతీరును కొనియాడుతూ తమదైన శైలిలో పోస్ట్ పెట్టింది. అంతేకాదు కోహ్లీ ఫోటోని షేర్ చేస్తూ గర్జించే సింహం అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: