కోహ్లీని చూసి నేర్చుకోండి.. గంభీర్ షాకింగ్ కామెంట్స్?

praveen
మొన్నటి వరకు విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ కారణంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. మాజీ క్రికెటర్లు అందరూ కూడా విరాట్ కోహ్లీ ఫామ్ గురించి స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు అన్న విషయం తెలిసిందే. అతనికి అవకాశాలు వచ్చినప్పటికీ విరాట్ కోహ్లీ మునుపటి ఫామ్ అందుకోలేక పోతున్నాడు అని.. మళ్లీ తనని తాను నిరూపించుకోలేకపోతున్నాడు అంటూ మాజీ క్రికెటర్ విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ పని అయిపోయిందని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
 ఇక ఇలాంటి విమర్శల నేపథ్యంలో ఇటీవల బిసిసిఐ అతనికి కొన్నాళ్లపాటు విశ్రాంతి కూడా ఇచ్చింది. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నా విరాట్ కోహ్లీ ఇటీవలే ఆసియా కప్లో భాగంగా ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తూన్నాడో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వరకు భారత్ ఆడిన మూడు మ్యాచ్ లలో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లీ ఫామ్ లోకి వచ్చాను అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే చూపిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే ఇటీవల పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడి 60 పరుగులు చేస్తే.. ఎన్నో అంచనాలు ఉన్న సూర్య కుమార్ యాదవ్,  పంత్ లు మాత్రం తక్కువ పరుగులకే  వికెట్లు కోల్పోయాడు  ఈ విషయంపై స్పందించిన గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒత్తిడి సమయంలో ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ ని చూసి నేర్చుకోవాలి అంటూ సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ లకు సూచించాడు.  కోహ్లీ అద్భుతంగా ఆడి పరుగులు రాబట్టారు. సింగిల్స్ డబుల్స్  గా మార్చాడు.   ప్రతిసారి భారీ షాట్లు కొట్టేందుకు వీలు ఉండదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కోహ్లీ మినహా మిగతా అందరు కూడా అనవసరమైన షాట్లు వికెట్ చేజార్చుకున్నారు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: