ఇండియా, పాక్ లకు.. షాకిచ్చిన ఐసీసీ?

praveen
ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల అందరి దృష్టిని ఆకర్షించిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎంత  ఉత్కంఠ భరితంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారో  అన్న విషయం పై ప్రేక్షకుల్లో తీవ్రస్థాయిలో కన్ఫ్యూషన్ నెలకొంది.  ఇలాంటి నేపథ్యంలోనే ఇక చివర్లో అదిరిపోయే సిక్సర్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ క్రమంలోనే ఐదు వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించింది టీమిండియా జట్టు.  ఇకపోతే గత ఏడాది టి 20 ప్రపంచకప్లో భాగంగా భారత జట్టు పాకిస్థాన్ చేతిలో ఓడిపోగా ఇక ఇప్పుడు ఆసియా కప్లో ప్రతీకారం తీర్చుకుంది.


 అయితే భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్రతీకారం అయితే తీర్చుకుంది గానీ  విజయానందంలో వున్న టీమిండియాకు ఐసీసీ షాక్ ఇచ్చింది. కేవలం టీమిండియాకు మాత్రమే కాదండోయ్ అటు ఓడిపోయిన పాకిస్తాన్ కు కూడా ఐసిసి షాక్ ఇవ్వడం గమనార్హం. ఈ మేరకు ఐసిసి ఇటీవలే ఒక కీలక ప్రకటన విడుదల చేసింది అని చెప్పాలి. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇరు జట్లకు కూడా జరిమానా విధిస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇరు జట్ల మ్యాచ్ ఫీజులో ఏకంగా 40 శాతం కోత విధిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.


 ఐసీసీ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.22 ప్రకారం మ్యాచ్ నిర్ణీత సమయం కంటే ఎక్కువగా మ్యాచ్  జరిగితే స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు మ్యాచ్లో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్ లకు బదులు కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తారు.  అయితే మ్యాచ్ లో  ఇరు జట్ల కోట సమయాన్ని గంటన్నర దాటి అరగంట ఇన్నింగ్స్ పొడిగించారు. దీంతో అరగంట సమయంలో ఇరు జట్లు ఫీల్డింగ్ లో     నిబంధనల మధ్య  బరిలోకి నిలిచాయి అని చెప్పాలి. ఏదేమైనా అటు గెలిచిన జట్టుకు ఇటు ఓడిన జట్టుకు కూడా ఐసీసీ షాక్ ఇచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: