జింబాబ్వేతో సిరీస్ లో అదరగొట్టాడు.. ప్రమోషన్ వచ్చేసింది?

praveen
ఇటీవలి కాలంలో టీమిండియాలో సీనియర్ ఆటగాళ్ల కంటే యువ ఆటగాళ్లు హవా కాస్త ఎక్కువగానే ఉంది అని చెప్పాలి. టీమిండియా లోకి వస్తున్న ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ టాలెంటుతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో యువ ఫేసర్ దీపక్ చాహర్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. టీమిండియాలో క్రమక్రమంగా కీలక బౌలర్గా ఎదుగుతున్నాడు ఈ యువ ఆటగాడు. అయితే మొన్నటి వరకు గాయం కారణంగా జట్టుకు దూరమైన దీపక్ చాహర్ ఇటీవలే మళ్లీ టీమిండియాతో చేరాడు.

 అయితే అతన్ని కొన్ని రోజులలో జరగబోయే ఆసియా కప్లో భాగంగా స్టాండ్బై ప్లేయర్గా బీసీసీఐ ఎంపిక చేసింది. అతని ఫామ్ నిరూపించుకునేందుకు ఇటీవల జింబాబ్వే పర్యటనలో టీమిండియా ఆడిన వన్డే సిరీస్కు ఎంపిక చేసింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల జింబాబ్వేతో జరిగిన సిరీస్లో భాగంగా అద్భుతమైన పునరాగమనం చేశాడు.  రెండు మ్యాచ్లలో ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో అతని ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని అతనికి ఆసియా కప్ లో తుది జట్టులో అవకాశం కల్పించాలని బిసిసీఐ భావిస్తోందట.

 ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీపక్ చాహర్ ఆసియాకప్ ప్రధాన జట్టులోకి చేరడం ఖాయం.. అతను కొంతకాలం నుంచి జట్టుకు దూరమైనప్పటికీ అతని ఫామ్ ఏ మాత్రం కోల్పోలేదు. దీపక్ చాహర్ పవర్ ప్లే లో ఒకటి రెండు వికెట్లు పడగొట్టి జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించగలడు. కాబట్టి టీ20 జట్టును ఎంపిక చేసే ముందు అతనికి ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి అని అభిప్రాయం వ్యక్తం చేశాడు.  ప్రస్తుతం  బుమ్రా, మహమ్మద్ షమీ లాంటి వాళ్లు అందుబాటులో లేకపోవడంతో వారి స్థానాన్ని దీపక్ చాహర్ భర్తీ చేయగలడు అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు మాజీ ఆటగాడు లక్ష్మీపతి బాలాజీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: