శుభమన్ గిల్ కూ.. ఆమెతో బ్రేకప్ అయిందా?

praveen
సాధారణంగా క్రికెటర్ల ప్రేమ వ్యవహారం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది అనే విషయం తెలిసిందే. క్రికెటర్లు ఎవరైనా అమ్మాయి తో డేటింగ్ లో ఉన్నారు అని తెలిస్తే ఇక దానికి సంబంధించిన చర్చ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.  ఈ క్రమంలోనే గతంలో భారత యువ ఓపెనర్ శుభమన్ గిల్ కి సంబంధించిన వార్తలు వైరల్ గా మారిపోయాయి. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ యువ క్రికెటర్ శుభమన్ గిల్ తో ప్రేమలో పడింది అని మీడియా మొత్తం కోడైకూస్తోంది.

 ఈ క్రమంలోనే ఎప్పుడూ సారా టెండూల్కర్ శుభమన్ గిల్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారిపోతూనే ఉంది. అయితే ఇటీవలే జింబాబ్వేతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భాగంగా సెంచరీ చేశాడు శుభమన్ గిల్.  ఇంటర్నేషనల్ క్రికెట్ లో తొలి సెంచరీ నమోదు చేశాడు.. ఈ క్రమంలోనే అతని పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే సారా టెండూల్కర్ పేరు కూడా మరోసారి ట్రెండ్ లోకి వచ్చేసింది. ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ కొంత కాలంగా వార్తలు వచ్చాయి.

 ఇద్దరూ ఒకరిని ఒకరిని సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉండడమే అంతేకాదు ఒకరి పోస్టులపై మరొకరు పరస్పరం లైక్ కామెంట్స్ కాంప్లిమెంట్స్ చేసుకుంటూ ఉండటమే వీరు ప్రేమలో ఉన్నారని టాక్ బయటికి రావడానికి కారణం.  గిల్ సెంచరీ కొడితే సారా టెండూల్కర్ మరోసారి సోషల్ మీడియాలో అభినందిస్తుందని  అందరూ అనుకున్నారు. కానీ సారా మాత్రం సోషల్ మీడియాలో స్పందించలేదు. అయితే గతంలో డోంట్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఏంజెల్స్ అంటూ శుభమన్ గిల్  ఒక పోస్టు పెట్టాడు. ఈ పోస్టు ద్వారా సారా టెండూల్కర్ తో బ్రేకప్ అయింది అని చెప్పకనే చెప్పాడు అన్నది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: