కోహ్లీ ఇప్పటికీ అందులో నెంబర్ 1 : షేన్ వాట్సన్

praveen
గత కొంత కాలం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ లో కొనసాగుతూ తీవ్ర నిరాశ పరుస్తున్నాడు. ఒకప్పుడు అత్యుత్తమ క్రికెటర్ గా తిరుగులేని ప్రస్థానాన్ని కొనసాగించిన విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో మాత్రం అదే రీతిలో జోరు  కొనసాగించలేక పోతున్నాడు. వరుస వైఫల్యాలతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు అని చెప్పాలి. అయినప్పటికీ మాజీ ఆటగాళ్లు మాత్రం  అతనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ కోహ్లీని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశాడు.

 టెస్టు ఫార్మాట్లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అంటూ షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ టాప్ టెన్లో లేకపోయినప్పటికీ అతడు ఎప్పటికీ నెంబర్ వన్ అంటూ ప్రశంసించాడు. ఐసీసీ రివ్యూ సందర్భంగా షేన్ వాట్సన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ క్రికెట్ ర్యాంకింగ్స్ లో టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కి ఆ స్థాయిని మెయింటెన్ చేసే సత్తా  ఉంది. విరాట్ కోహ్లీ లో ఇప్పటికీ టాలెంట్ అలాగే ఉంది. అందుకే ఇప్పటికికూడా టెస్టుల్లో నెంబర్వన్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అని చెప్పగలను.

 అదే సమయంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం కూడా ఒక అద్భుతమైన ఆటగాడు. అయితే తన ఆటను టెస్టు క్రికెట్లో ఎలా మలుచుకున్నాడు  అన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. అందుకే అతడిని టెస్టు ఫార్మాట్లో నెంబర్ 2 ఆటగాడిగా పరిగణిస్తున్నా అంటూ షేన్ వాట్సన్ తెలిపాడు. అయితే ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ జాబితాలో కాస్త వెనకంజ లోనే ఉన్నాడు. బౌలర్ల పై అతడు అనుకున్నంత ఒత్తిడి పెంచలేక పోతున్నాడు అన్నది నా అభిప్రాయం అంటూ తెలిపాడు. ఇక కేన్ విలియమ్సన్ కూడా మంచి ఆటగాడు బౌలర్ల పై ఒత్తిడి పెంచే సత్తా ఉన్నోడు అంటూ షేన్ వాట్సన్ ఐసిసి రివ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: