స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్.. సెలెక్టర్ల వల్లే అంటూ షాకింగ్ కామెంట్స్?

praveen
సాధారణంగా క్రికెట్లో సీనియర్ లుగా కొనసాగుతున్న వారు వయసు మీద పడినప్పుడు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాని కొన్నిసార్లు మాత్రం అనుకోని విధంగా  ఫామిలీ సమస్యల వల్ల మరికొన్నిసార్లు సెలక్టర్ల తీరు వల్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ముగించాలని భావిస్తూ ఉంటారు. ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ క్రికెటర్లు ఇలాంటి నిర్ణయాలతో అభిమానులకు షాక్ ఇచ్చారు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఐర్లాండ్ క్రికెట్ దిగ్గజం కెవిన్ ఒబ్రెయిన్ కూడా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. దీంతో అభిమానులు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అంటూ ఇటీవలే సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ నుంచి తప్పుకుంటానని భావించినప్పటికీ.. తనను సెలెక్టర్లు పక్కన పెట్టడం ఎంతో మనో వేదనకు గురి చేసిందని అందుకే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను అంటూ 38 ఏళ్ల కెవిన్ ఓబ్రెయిన్ చెప్పుకొచ్చాడు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఒక పెద్ద నోట్ రాసుకొచ్చాడు ఈ స్టార్ ప్లేయర్.
 ఐర్లాండ్ జట్టుకు ఆడిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాడు. ఈ ప్రయాణంలో ఎంతో మంది స్నేహితులను సంపాదించుకోవడం నా అదృష్టం. నాతో పని చేసిన కోచ్ లు సిబ్బందికి ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడే అవకాశం కల్పించారు. క్రికెట్ ప్రయాణంలో వెన్నంటే ఉన్న కుటుంబానికి థాంక్యూ. నేను ఆటలో బిజీగా ఉన్న సమయంలో కుటుంబాన్ని బాధ్యతలు తీసుకున్న నా భార్యకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. అయితే అతని సడన్ రిటైర్మెంట్ తో షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: