వారెవ్వా.. ఎంట్రీలోనే అదుర్స్.. భారత కుర్రాళ్లు కుమ్మేస్తున్నారూ?

praveen
ఇటీవలి కాలంలో భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయినా ఎంతో మంది కుర్రాళ్ళు ఇంగ్లండ్ వేదికగా కౌంటీ ఛాంపియన్ షిప్ పోటీలలో టోర్నీలో అవకాశం దక్కించుకుని ఇంగ్లండ్ గడ్డపై ఆడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  కౌంటీ ఛాంపియన్షిప్ 2022 సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన కుర్రాళ్ళు  ఆరంభంలోనే ఆదరగొట్టేస్తున్నారూ అనే చెప్పాలి. తొలి మ్యాచ్లోనే అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో మెప్పించి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పటికే భారత సీనియర్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా  ససెక్స్ జట్టుకి కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఒకవైపు జట్టును ముందుకు నడిపిస్తు మరోవైపు పరుగుల వరద పారించాడు.

 సెంచరీలు డబుల్ సెంచరీలతో అవాక్కయ్యేలా చేస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ ఏడాది ఎడిషన్లో కౌంటీ ఛాంపియన్షిప్లో భాగం అయినా నవదీప్ సైని వాషింగ్టన్ సుందర్ లు కూడా ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం. లంక షైర్ క్లబ్ తరఫున కౌంటీ లో ఆరంగేట్రం చేశాడు వాషింగ్టన్ సుందర్.  ఈ క్రమంలో మొదటి మ్యాచ్ లో మొదటి ఓవర్లో రెండో బంతికే వికెట్ పడగొట్టి సత్తా చాటాడు అనే చెప్పాలి. ఇక తొలి ఇన్నింగ్స్లో 22 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి తన ప్రదర్శనతో ఔరా అనిపించాడు.

 లంక షేర్ జట్టు తరఫున టాప్ వికెట్ టేకర్ గా వాషింగ్టన్ సుందర్ నిలిచాడు అని చెప్పాలి. అయితే బౌలింగ్ లో బాగా రాణించిన వాషింగ్టన్ సుందర్ అటు బ్యాటింగ్లో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయాడు. 10 బంతులు ఆడిన వాషింగ్టన్ సుందర్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. ఇక మరోవైపు కెంట్ క్లబ్ తరఫున ఎంట్రీ ఇచ్చిన నవదీప్ సైని తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. బౌలింగ్  లో మాత్రం అదరగొట్టాడు. 18 ఓవర్లు వేసి నాలుగు మెయిడిన్ లతోపాటు ఐదు వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో 72 పరుగులు కూడా సమర్పించున్నాడు. కెంట్ జట్టు తరఫున టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇలా భారత కుర్రాళ్లు అరంగేట్రంలోనే అదరగొడుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: