వైరల్ : బాబోయ్.. జడ్డూ లాగా ఎవరు క్యాచ్ పట్టలేరేమో?

praveen
సాధారణంగా క్రికెట్లో క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అంటూ ఒక మాట ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్క క్యాచ్ కూడా వదలకుండా పడితే ఆ జట్టు విజయం సాధించడం పక్క అని ఎంతో మంది విశ్లేషకులు చెబుతుంటారు. ఇక ఈ విషయం ఎన్నో మ్యాచ్ లలో కూడా నిజం   అని తేలింది. అయితే సాధారణంగా ఒక జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కేవలం కొంతమంది ఆటగాళ్లపై మాత్రమే ప్రేక్షకులు చూపు ఉంటుంది. ఎందుకంటే మైదానంలో మెరుపువేగంతో కదులుతూ ప్రత్యర్థులను పెవిలియన్కు పంపించే ఆటగాళ్లు కేవలం కొంత మంది మాత్రమే ఉంటారు అని చెప్పాలి.

 అలాంటి వారి గురించి మాట్లాడుకోవాలి వస్తే ముందుగా టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గురించి మాట్లాడుకోవాలి అని చెప్పాలి. అతను మైదానంలో మెరుపువేగంతో కదలటం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  పాదరసంలా కదులుతూ రనౌత్ చేయడం.. అద్భుతమైన క్యాచ్ పట్టడంలో రవీంద్ర జడేజా అని చెప్పాలి. ప్రపంచంలోని ది బెస్ట్ ఫీల్డర్ గా కూడా రవీంద్ర జడేజాకు ముద్ర పడింది. ఇకపోతే ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా మరోసారి రవీంద్ర జడేజా తన ఫీల్డింగ్  సామర్థ్యంతో అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

 మూడో వన్డే మ్యాచ్లో రవీంద్ర జడేజా పట్టిన క్యాచ్లు ఏకంగా మ్యాచ్ హైలైట్ గా మారిపోయాయ్ అని చెప్పాలి. అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్ ఎంతో ధాటిగా ఆడుతున్న సమయంలో మరో ఎండ్ నుంచి లివింగ్ స్టోన్ ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. దీంతో వీరి భాగస్వామ్యం ఇండియా అభిమానులను కలవర పెట్టింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్  వేయగా ఒక భారీ సిక్సర్ కొట్టాడు లివింగ్స్టన్. కానీ బౌండరీ దగ్గర కాచుకుని ఉన్న రవీంద్ర జడేజా కళ్ళు చెదిరే క్యాచ్ పట్టుకుని లివింగ్ స్టోన్ ను పెవిలియన్ పంపించాడు. ఆతర్వాత బట్టర్ భారీ షాట్ అడగ చాలా దూరం నుంచి పరిగెత్తుకొచ్చిన జడేజా ఎంతో అలవోకగా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టుకున్నారు జడేజా. ఇది చూసిన తర్వాత జడ్డు లాగా ఎవరు క్యాచ్ పట్ట లేరేమో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: