టీమిండియాతో వన్డే మ్యాచ్.. వెస్టిండీస్ జట్టులోకి ఆ సీనియర్?

praveen
ఇటీవలి కాలంలో భారత జట్టు వరుసగా విదేశీ పర్యటనలకు వెళుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనను  ఎంతో విజయవంతంగా ముగించుకుంది భారత జట్టు. ఈ పర్యటనలో భాగంగా ఆడిన టెస్ట్ మ్యాచ్ లో ఓటమితో నిరాశపరిచినా భారత జట్టు..  ఆ తర్వాత టీ20 వన్డే సిరీస్ లలో మాత్రం సత్తా చాటింది అని చెప్పాలి.ఈ క్రమంలోనే ఆతిథ్య   ఇంగ్లాండ్ జట్టుకు భారత్ అద్భుతమైన ప్రదర్శన తో షాక్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే ఇలా ఇంగ్లండ్ పర్యటన ఎంతో విజయవంతంగా ముగించింది భారత జట్టు. ఇక మరికొన్ని రోజుల్లో అటు వెస్టిండీస్ పర్యటనకు వెళ్ల పోతుంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాలో భాగమైన ఎంతో మంది ఆటగాళ్లకు వెస్టిండీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇక వెస్టిండీస్ పర్యటనలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో కాకుండా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో టీమిండియా బరిలోకి దిగబోతోంది అన్నది తెలుస్తుంది. ఇప్పటికే అటు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టును ప్రకటించింది టీమిండియా. స్వదేశంలో టీమిండియాతో జరగబోతున్న మూడు వన్డేల కోసం 13 మంది సభ్యులతో కూడిన జట్టును వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

 కాగా గత కొన్ని నెలలుగా వెస్ట్ఇండీస్ జట్టుతో దూరంగా ఉన్న వెటరన్  ఆల్రౌండర్ జాసన్ హోల్డర్  తిరిగి జట్టులోకి వచ్చాడు అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే అతని అనుభవం ఇండియా తో మహిళలు వెస్టిండీస్ జట్టుకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది. జులై 22వ తేదీన భారత్ వెస్టిండీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు వన్డేల సిరీస్ తో పాటు 5 టి20 సిరీస్ కూడా ఆడబోతుంది టీమిండియా. శిఖర్ ధావన్ కెప్టెన్సీలోని టీమిండియాతో ఎలా రాణించ పోతుంది  అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: