పాపం వార్నర్.. వికెట్ బెయిల్ ఎక్కడ తగిలిందో చూడండి?
ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది మూడు రోజు ఆటలో భాగంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 23వ ఓవర్ ట్రావీస్ హెడ్ వేయడానికి వచ్చాడు. జెఫ్రి వండర్సే స్ట్రైకింగ్ లో ఉన్నాడు. ఓవర్ లో తొలి బంతి వికెట్లను గిరాటేసింది అయితే వికెట్ తీసిన ఆనందంలో మిగిలిన ఆటగాళ్లు అందరూ ఉన్నారు. ఇక డేవిడ్ వార్నర్ పిచ్ పై దొర్లుతూ కనిపించాడు దీంతో ఏం జరిగిందని ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత టీవీ రీప్లే లో చూసిన తర్వాత జరిగిన విషయం తెలిసి చివరికి అందరూ అవాక్కయ్యారు అని చెప్పాలి.
బంతి వికెట్ల దగ్గర తగలగానే ఇక వికెట్ల పైన ఉన్న బెయిల్స్ లో ఒకటి డేవిడ్ వార్నర్ కు తగలరాని చోట తగిలింది ఊహించని ఘటన తో ఒక్కసారిగా వార్నర్ షాక్ అయ్యి మైదానంలో కుప్పకూలిపోయాడు. ఇది చూసి అయ్యో పాపం డేవిడ్ వార్నర్ కు ఎంత కష్టం వచ్చింది అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. సాధారణంగా అప్పుడప్పుడు బాల్ బ్యాట్స్మెన్ లకు తగలటం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా మాత్రం వికెట్ల పైన ఉన్న బెయిల్ ఎగిరి వార్నర్ కు తగలడం గమనార్హం.