బుమ్రా అలా చేయాలి.. లేదంటే విజయం కష్టమే : ఆకాశ్ చోప్రా

praveen
గత ఏడాది టీమ్ ఇండియా ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా కరోనా వైరస్ ఆటంకాలు సృష్టించడంతో ఇక 5 టెస్ట్ సిరీస్ లలో భాగంగా ఐదో టెస్టు మ్యాచ్ వాయిదాపడింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఇక నేటి నుంచి ఈ వాయిదా పడిన టెస్ట్ మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైంది. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో టీమ్ ఇండియా కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అయితే బెన్ స్టోక్స్ టెస్ట్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత ఇంగ్లాండ్ జట్టు ఇటీవలే న్యూజిలాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో పూర్తి ఆధిపత్యం సాధించింది.  న్యూజిలాండ్ జట్టును 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది ఇంగ్లాండ్.

 దీంతో ఇండియాతో ఆడబోయే టెస్ట్ మ్యాచ్ కోసం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది అని చెప్పాలి. అదే జోరును కొనసాగించేందుకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో గత కొంత కాలం నుంచి టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేయని టీమిండియా.. అసలే అనుభవం లేని బుమ్రా కెప్టెన్సీలో కీలకమైన మ్యాచ్  ఎలా ఆడ బోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రవీంద్ర జడేజాకు విశ్రాంతి ఇచ్చి శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్ లను తుది జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.

 ఇక వీరిద్దరినీ జట్టులోకి ఎందుకు తీసుకోవాలి అన్న విషయాలను కూడా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా చెప్పుకొచ్చాడు. ఇంగ్లాండ్ పిచ్ లు ఎక్కువగా పేసర్లకు అనుకూలిస్తు ఉంటాయి. కాబట్టి పేస్ బౌలింగ్ లో ఇబ్బంది  పడే జడేజాకు విశ్రాంతి ఇస్తే బాగుంటుంది.  భారత్ తొలుత బ్యాటింగ్ చేస్తే మహమ్మద్ షమీ, బుమ్రా, సిరాజ్ లతో బరిలోకి దిగి.. పరిస్థితులను బట్టి ఉమేష్ యాదవ్ ను కూడా పరిగణలో పెట్టుకోవాలి. గతంలో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ ఎంతో బలహీనంగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందరు కూడా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే అత్యుత్తమమైన బౌలింగ్ ఎటాక్ తో బరిలోకి దిగాలి. లేదంటే భారత్ గెలవడం కష్టమే అంటూ చెప్పుకొచ్చాడు ఆకాశ్ చోప్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: