క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్... కివీస్ కు ఘోర ఓటమి !

VAMSI
ఇంగ్లాండ్ పర్యటనలో కివీస్ గెలుపు రుచి చూడకుండానే వెనుతిరుగుతోంది. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ కు వచ్చిన కివీస్ మూడింటిలోనూ ఓడిపోయి తలఒంపులు తెచ్చుకుంది. మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు 5 వికెట్ల తేడాతో కివీస్ ను ఓడించింది. ఇందులో ఇంగ్లాండ్ విజయంలో మాజీ కెప్టెన్ రూట్ సెంచరీ సాధించి కీలక పాత్ర పోషించాడు. ఇక రెండవ టెస్ట్ లోనూ కీలకమైన రెండవ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసిన కివీస్ మరోసారి ఓటమిని మూటగట్టుకుంది. ఇక ఆఖరి టెస్ట్ లో అయినా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన కివీస్ కు ఇక్కడ కూడా చుక్కెదురైంది.
మూడవ టెస్ట్ లో ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో కివీస్ ను ఓడించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దీనితో కివీస్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ సిరీస్ ను కోల్పోవడానికి ప్రధాన కారణం మాత్రం కివీస్ టాప్ ఆర్డర్ మాత్రమే అని చెప్పాలి. మొత్తం మూడు టెస్ట్ లలో కూడా అడపదడపా లాతమ్ తప్పించి ఇంకెవ్వరూ ఆశించిన మేర ఆకట్టుకోలేదు. ముఖ్యంగా కెప్టెన్ విలియం సన్ ఆడింది ఒక్క మ్యాచ్ అయినా అందులోనూ ఫెయిల్ అయ్యాడు.
టీం మొత్తం మీద డారిల్ మిచెల్ మరియు కీపర్ బ్యాట్స్మన్ టామ్ బ్లాండెల్ లు మాత్రం తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతి సరి ఆదుకుని ఒడ్డుకు చేర్చారు. కానీ మిగిలిన ఆటగాళ్ల నుండి సరైన స్పందన లేకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ సిరీస్ నుండి న్యూజిలాండ్ చాలా విషయాలను నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంతే కాకుండా తీవ్ర ఒత్తిడిలో ఉన్న కేన్ విలియం సన్ కూడా కాస్త విశ్రాంతి తీసుకోవడం మంచిది.  మరి చూద్దాం రానున్న సిరీస్ లలో కివీస్ బౌన్స్ బ్యాక్ అవుతుందేమో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: